ఓంకారం ఆయూర్వేదం ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత ఆరోగ్య శిభిరం.. వైద్య-ఆరోగ్య బ్రహ్మా గురూజీ మహారాజు

0
35
తాజాకబురు
తాజాకబురు

తాజాకబురు కరీంనగర్:మారుతున్న సాంకేతికం ఓ పక్క ప్రజలకు మేలు చేసినా మరో అత్యంత భయంకరంగా కీడు చేస్తుంది,మానవుల ఆహారవిధానం జీవనశైలి వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు,తద్వారా ఎన్నో రుగ్మతలతో జీవిత కాలం ఇబ్బందులు పడుతు బ్రతుకీడుస్తున్నాడు,ఈ కాలుష్యం అయిన నేటి పరిస్థితిల్లో వయసుతో తేడాలేకుండా ఆరువై ఏళ్లల్లో వచ్చె వ్యాధి ఇప్పుడు పదేహేను ఏళ్లకు వస్తుంది దానికి కారణం ఆహారలోపం,జీవన విధానం దీనికితోడు వ్యాధి వచ్చినప్పుడు వాడుతున్న హలోపతి మాత్రలు వెరసి మానవుని సగటు వయసును క్షీణంపజేసి వ్యాధులబారీన పడే విధంగా చేస్తున్నాయి,ఈ విపత్కర పరిస్థితిలో మనుషులను కాపాడేది మాత్రం “ఆయూర్వేదం” మాత్రమే అంటున్నారు గురూజీ మహారాజు…

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణమండపంలో గత నెల 26 నుండి నిరుపేదలకు వైద్యశిభిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని ఓంకారం ఆయుర్వేదం వ్యవస్థాపకుడు వైద్య-ఆరోగ్య బ్రహ్మా గురూజీ మహారాజు అన్నారు,అయుర్వేదం అనేది మనిషి మనుగడను వారి అమ్మ విశ్వాసాన్ని పెంపోందించేందుకు ఎంతో దోహాదం చేస్తుందని,ఎందరో నిరుపేదలు వ్యాధుల బారీన పడి ఎవరులేకా ఇబ్బందులు పడుతున్నవారిని చేరదీసి వారికి వైద్యం అందించటమె కాకుండా వారికి ఉచితంగా రెండు పూటల‌ బోజనం అందిస్తున్నామని తెలిపారు,పదిహేనురోజులపాటు కీళ్లు,నడుము,కీళ్లవాతం,చర్మవ్యాధులు ఇలా అన్నీ రకాల మందులను అయుర్వేద యండీ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్,లక్ష్మినారాయణ పర్యవేక్షణలో అందజేస్తున్నామని తెలిపారు.

దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంలో ఎన్నో చక్కని మందులు ఉన్నాయని వాటిని వాడితే ఎలాంటి సైడ్ రుగ్మతలు వాటిల్లకుండా వ్యాధి తగ్గుతుందని అన్నారు.మనిషి ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాలని నిత్యం యోగా,ధ్యానం చెయ్యడం వల్ల వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పడుతాయని పేర్కోన్నారు,వైద్యం నేర్చుకోవటం ముఖ్యం కాదు తెలిసిన వైద్యాన్ని పదిమందికి అందించినప్పుడె ఆ వృత్తి కి సార్థకత లభిస్తుందని,నిరుపేదల కోసం ఓంకారం ఆయుర్వేదం ఆధ్వర్యంలో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here