ఒడ్డె లింగాపూర్ లో ఎరువుల దుకాణం ప్రారంభం

0
221

రాయికల్ తాజా కబురు: మండలంలోని భూపతిపూర్ సహకార సంఘాల పరిధిలో ఒడ్డె లింగాపూర్ గ్రామంలో ఎరువుల కొనుగోలు కేంద్రము పి.ఎ. సి.ఎస్ చైర్మన్ ఏనుగు ముత్యంరెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎరువులు .యూరియా, డిఎపి ,కాంప్లెక్స్ అందుబాటులో ఉండటం వల్ల రైతు ఎరువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఈఓ చంద్ర శేఖర్, ఒడ్డె లింగాపూర్ గ్రామ సర్పంచ్ పాలకుర్తి రవి చింతలూరు సర్పంచ్ అనుపురం శ్రీనివాస్ ,లింగాపూర్ ఎంపిటిసి పాల్ తీయ సప్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ నాగుల మల్లయ్య ,డైరెక్టర్లు కొసరి మహేష్, పాల్ తీయ రమణ, నేతల లక్ష్మీనారాయణ, లక్క మొండయ్య, నాయకులు మంగీలాల్, గంగాధర్, బోదాసు జలపతి, ముత్యం పేట మల్లయ్య, సిబ్బంది రాజేష్, రంజిత్, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here