ఐ.కె.పి ఆధ్వర్యంలో వరి ధాన్యపు కొనుగోళ్లు ప్రారంభం

0
161

రాయికల్ రూరల్: మండలంలోని భూపతిపూర్, అల్లిపూర్ గ్రామాల్లో ఐ.కె.పి ఆధ్వర్యంలో వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి రైతులకు అవగాహనా కల్పించిన అనంతరం హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఎం చక్రవర్తి ఆయా గ్రామల సర్పంచులు జక్కుల చంద్రశేఖర్, అత్తినేని గంగారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు,ఎంపీటీసీ మోర విజయలక్ష్మి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ లు, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here