ఐపాయే…పబ్జీ పాయే..ఐపాయే…

0
270

పబ్జీ శకానికి చరమగీతం..బ్యాన్ చేసిన కేంద్రం…

తాజా కబురు టెక్నికల్ టీం:పబ్జీ ….ఈ పేరు వినగానే ముఖ్యంగా విద్యార్థులు,యువకులకు ఎక్కడలేని ప్రేమ,ఎందుకంటే “పబ్జీ” అన్నం కలిపి పెడుతుంది, ” పబ్జీ”పనులన్నీ చేస్తుంది, “పబ్జీ” ఎవ్వరు చెయ్యలేని పని చేస్తుంది,ఎందుకంటే ఎవరు ఎమైపోతె మాకేంటి “నేను నా పబ్జీ” ఆకలి కాదు, అయినా తినుకుంటు ఆడతా,పనిలేదు ఎందుకంటే “పబ్జీ” ఖండ గా పని ఎందుకు, అదో ఫ్యాషన్, అదో హాబీ, అదో కృరత్వం, అవతలి వ్యక్తులను తమవద్ద ఉన్న గన్ తో టపాటఫా కాల్చేస్తుంటె ఆనందం,ఒలంపిక్స్ లో మెడల్ సాధించినంత ఆనందం అవతలి వ్యక్తి తన పైకి వస్తుంటే కళ్ళు గిలపకుండా దాడికి దిగి హే…చపా చపా ఇకా చంపడమో చావడమో బరిలోకి దిగి చూసుకుందాం అన్నంగ పని చేస్తారు, ఇక కొందరైతే పబ్జి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు లోకం లో జరుగుతున్న వింతలు విశేషాలు ఏమీ కూడా తెలియకుండా తమ లోకంలో తాము ఉంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి ప్రబలి ఆరు నెలలు గడిచిపోతున్న సందర్భంలో ఈ పబ్జి ఆటగాళ్లు మరింత పెరిగారు ,అస్తమానం వాటి వైపే చూస్తూ పబ్జే ఆకలిగా తింటూ పబ్జి దాహంగా తాగుతూ పబ్జి జీవితం గడిపేశారు, ఇక పిల్లలకు చెప్పలేక పబ్జి ఆట మానేయ్ అనలేక తల్లిదండ్రులు అనుభవించిన మానసిక క్షోభకు విముక్తి లభించింది. మొన్నటివరకు టిక్ టాక్, ఇప్పుడు పబ్జీ ఇవి ఎంత తమవైపు మనుషులను తిప్పుకున్నాయంటె కని పెంచిన తల్లిదండ్రులను కూడా మర్చిపోయెంత…..ఆగడాలు శృతిమించినప్పుడు అంతం తప్పదంటారు ఇప్పుడు అదె జరుగింది…కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లపై బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్‌, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్‌, విచాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీన్‌, సైబర్‌ హంటర్‌, లైఫ్‌ ఆఫ్టర్‌ వంటి పలు యాప్‌లను ప్రభుత్వం నిషేధించిందిపబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ గేమ్‌కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్‌ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు. ఇక సరిహద్దుల్లో డ్రాగన్‌ దూకుడుతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా భద్రతా కారణాలతో టిక్‌టాక్ సహా 106 చైనా యాప్‌లను ఇటీవల భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here