ఐకెపి సెంటర్ అక్రమాలపై చర్యలు తీసుకోండి

0
139

విడిసి అధ్వర్యంలో
బుగ్గారం తహసీల్దార్ కు రైతుల విజ్ఞప్తి

తాజా కబురు బుగ్గారం:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుగ్గారం తహసీల్దార్ సుజాతకు శనివారం రైతులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఐకెపి కొనుగోలు కేంద్రంలో ప్రతి 40కిలోల వరిధాన్యం సంచికి లెక్క లేకుండానే అదనంగా 2కిలోలు తూకం వేశారని, రైస్ మిల్లర్ల పేరుతో ఇష్టం వచ్చినట్లు రైతులు అమ్మిన వరిధాన్యంలో కోతలు విధిస్తున్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వరిధాన్యం అమ్మకాలు జరిపి నెలలు గడిచినా నేటికీ రైతుల వరిధాన్యం అమ్మకాలకు సబందించిన రశీదులు ఇవ్వలేదని ఆరోపించారు. మేము అమ్మకాలు జరిపిన వరిధాన్యానికి సరిపడా డబ్బులు రావడం లేదని తహశీల్దార్ సుజాతతో రైతులు వాపోయారు. తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు బుగ్గారం ఐకెపి సెంటర్ లో జరిగిన మోసాలు, కోతలు, ఇతరత్రా అక్రమాలపై తెలియజేయాలని తహసీల్దార్ సుజాతను బుగ్గారం గ్రామ రైతులు కోరారు. తగు న్యాయ విచారణ చేపట్టి ఎలాంటి కోతలు, తరుగులు లేకుండా రైతుల ద్వారా తూకం వేసిన ప్రతి వడ్ల (వరి ధాన్యం) గింజకూ ధర చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని బుగ్గారం గ్రామ రైతులు తహసీల్దార్ సుజాతకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో
గ్రామ అభివృద్ధి కమిటీ – బుగ్గారం అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రైతులు కొడిమ్యాల రాజన్న, పరుమాల పోచన్న, సుంకం పోచమల్లు, కప్పల శంకర్, మసర్ధి పోచయ్య, విలాసాగరపు రాజేశం, మాదాసు బక్కన్న (రామన్న), మసర్ధి పోచన్న రాజన్న, చీపిరిశెట్టి సత్తన్న, చుక్క రాజన్న, మసర్ధి మధూకర్, పెద్దనవేని రాఘన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి తెలియజేస్తాతహసీల్దార్ సుజాత

బుగ్గారం గ్రామ రైతులు శనివారం అందజేసిన విజ్ఞాపన పత్రాన్ని ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తానని బుగ్గారం తహసీల్దార్ సుజాత తెలిపారు. తగు విచారణ జరిపి రైతులకు వీలైనంత వరకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని తహసీల్దార్ సుజాత హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here