తాజా కబురు ధర్మారం టౌన్ : నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని భాజపా ధర్మపురి నియెాజకవర్గ ఇంచార్జ్ కన్నం అంజయ్య పిలుపు నిచ్చారు.మంగళవారం మండల కేంద్రంలోని మార్కేట్ యార్డులో ఏబీవీపీ ధర్మారం నగర శాఖ ఆధ్వర్యంలో సుమారు 70 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలను ఆయన పంపిణి చేశారు.ఈ సందర్బగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది నిరుపేద కుటుంబాలు రోజు వారి కూలీలకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి నెలకొన్నదని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని బియ్యం, కూరగాయలను పంపిణి చేయడం జరిగిందని, ధర్మపురి నియెాజక వర్గంలో ఏ ఒక్కరికి ఆపద వచ్చిన అందుబాటులో ఉంటానని, కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండి,సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని తరిమి వేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఊషణ.అన్వేష్,భాజపా మండల అద్యక్షుడు యాల్ల తిరురతి రెడ్డి, కాడె సూర్యనారాయణ,ఎబివిపి నగర కార్యదర్శి శ్రీధర్,ఉపాధ్యక్షుడు రేచవేణి సాగర్,కార్యకర్తలు అంకిత్,అనిల్,నరేష్,సాయి,నవీన్ తదితరులు పాల్గొన్నారు..