ఎమ్మెల్యే రసమయిని అడ్డుకున్న “ఏబీవీపీ కార్యకర్తలు”

0
29

మానకొండూరు తాజా కబురు: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చుక్కెదురైంది.మానకొండూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు శనివారం ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.33 జిల్లాలలో ఒక్కో జిల్లాకు 2000 ఉద్యోగాల చొప్పున 66000 వేల నూతన ఉద్యోగాల కల్పనను చేసి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వాహనానికి అడ్డం తిరిగి రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here