ఎప్పటికైనా పత్రికా స్వేచ్ఛ కోసమే పని చేయాలనీ అన్నదే ముఖ్య లక్షణం

0
41

తాజా కబురు జగిత్యాల:అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ,ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిగా నిలిచె జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా టి.యూ.డబ్లూ జె హెచ్143 ఎలాక్ట్రానిక్ మీడియా (టెంజ్) అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ… దేశంలో ఎన్నో సమస్యలపై తమవంతు కలంతో గలం విప్పి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా, దేశంలోని ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్యం, అవినీతి అంతమొందించడంలో, సామాజిక రంగాల్లో తమ వంతుగా మీడియా కృషి చేస్తుందని,పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్య్రం అమలవుతుందంటే… ఆ దేశములో ప్రజాస్వామ్య పాలనకు ఎటువంటి ఇబ్బందులు లేవు అనే చెప్పాలి.

ఎప్పటికైనా పత్రికా స్వేచ్ఛ కోసమే పని చేయాలనీ అన్నదే ముఖ్య లక్షణం.

ఇక ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్‌ కౌన్సిళ్లు కూడా ఉన్నాయి అంటే నమ్మండి. అయితే మన దేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌ కౌన్సిల్‌ అందరిని ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తుంది.

గత12 సంవత్సరాలుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇక అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించడం కూడా జరిగిందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here