ఎన్నారై పాలసీని అమలు చేయాలని గల్ఫ్ కార్మికులు జెండా ఆవిష్కరణ….

0
1240
  • ఎన్నారై పాలసీని అమలు చేయాలని గల్ఫ్ కార్మికులు జెండా ఆవిష్కరణ….

 

 

గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో సంపూర్ణ ఎన్నారై పాలసీ సాధన లక్ష్యంగా పైడిమడుగు లో జెండా ఆవిష్కరణ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి…

ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకు భారమై ఎడారి దేశాల ఎండమావుల కి వెళ్లి అక్కడ పనిచేస్తున్న పూట గడవక ప్రాణం పై ఆశ లేక బతుకుతున్న ఎందరో గల్ఫ్ కార్మికులకు భరోసానిచ్చే ఎన్నారై పాలసీని అమలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో గల్ఫ్ కార్మికులు జెండా ఆవిష్కరించారు.

గల్ఫ్ లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలని ఉద్దేశంతో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తే కార్మికుల జీవితాల్లో భరోసా ఉంటుందని అందువల్ల ఎన్నారై పాలసీ అమలు చేయాలని కోరుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కి వినతి పత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఎన్నారై పాలసీ జెండా ఆవిష్కరించారు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా దుబాయ్ సౌదీ మస్కట్ సింగపూర్ ఇతర దేశాల్లో అధిక సంఖ్యలో బతుకుతున్నారు వీరికి ప్రభుత్వం ఎన్నారై పాలసీ అమలు చేస్తే వారి ఆరోగ్యానికి వారి కుటుంబ పిల్లలకు హాజరు గా ఉంటుందనే ఉద్దేశంతో ఎన్నారై పాలసీని అమలు చేయాలని కోరుతున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ బాషా,గుగ్గిల్ల రవి, అలాగే గ్రామ యన్.ఆర్.ఐ లు ఎద్దండి రమేశ్,బత్తుల తిరుపతి, దొమ్మాటి గంగాధర్, రవి,రాజేంధర్, శ్రీనివాస్,శంకర్,ప్రవీణ్, సర్పంచి దమ్మ‌ భీమరెడ్డి, యంపిటీసి మాధురి గోపాల్,లక్పతి,మోహాన్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here