ఎంపీ ధర్మపురి అర్వింద్, ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భాజపా నాయకులు

0
42

జగిత్యాల తాజా కబురు:జగిత్యాల జిల్లా రాయికల్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో భూపతిపూర్ ఎక్స్ రోడ్ నుండి వయా మూటపెల్లి, ఇటిక్యాల మీదుగా రామారావు పల్లి గ్రామం వరకు ప్రధాన్ మంత్రి గ్రామీన్ సడక్ యోజన కేంద్ర పథకం ద్వారా రోడ్డు ఏర్పాటు కోసం కృషిచేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్, ప్రధాని మోడీ చిత్రపటానికి సోమవారం భూపతిపూర్ ఎక్స్ రోడ్ వద్ద భాజపా నాయకులు పాలాభిషేకం చేశారు.ఈ సంధర్బంగా భాజపా మండల అధ్యక్షులు అన్నవేణి వేణు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులు అన్నీ కేంద్రం నుండి వస్తున్నాయని, వైకుంటాదామలు, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్ లు మొదలైన గ్రామ అభివృద్ధి కి సంబంధించిన ప్రతీ రూపాయి కేంద్రం ఇస్తుందని, కానీ కొంతమంది మంది తప్పుడు ప్రచారం చేస్తూ కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు అని చెప్పుకుంటున్నారని, పబ్బం గడిపే వారిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం చెపుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల మహేష్,ప్యాక్స్ ఛైర్మెన్ ఏనుగు ముత్యం రెడ్డి,యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్,మండల ఉపాధ్యక్షుడు కొల శంకర్,చిలివేరి నాగరాజు,సంకోజిశేఖర్,సత్యనారాయణ,కంచిరవి,ఆనంద్,సంజీవరెడ్డి,మనోజ్,శివ,వినోద్,రాజశేఖర్,ప్రసాద్,భూమయ్య,శ్రీనివాస్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here