ఊరికి ప్రేమతో….. కల్లూరు గ్రామంలో నిత్యా వసర వస్తువుల పంపిణీ చేసిన వైద్యులు

0
384

ఊరికి ప్రేమతో…..
కల్లూరు గ్రామంలో నిత్యా వసర వస్తువుల పంపిణీ చేసిన వైద్యులు

తాజకబురు: కోరుట్ల ప్రతినిధి

కోరుట్ల మండలం కల్లూరు గ్రామం లో ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం తరువాత వివిధ నగరాల్లో విద్యనభ్యసించి డాక్టర్ గా కరీంనగర్ నడిబొడ్డులో సన్రైజ్ హాస్పిటల్ నడిపిస్తున్న టువంటి డాక్టర్ జానా సురేష్ తన చిన్ననాటి జ్ఞాపకాలని మదిలో భద్రపరచుకుని ఈరోజు కల్లూరు గ్రామానికి కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చిన నుండి గ్రామ స్థితిగతులు అన్ని చూసి తెలుసుకుని దాదాపు రెండు లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులు శానిటేషన్ మాస్కులు ప్రతి ఇంటికి పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వన తడుపుల అంజయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కోరుట్ల మండలం ఎంపీపీ తోట నారాయణ జడ్పిటిసి దారి శెట్టి లావణ్య ,జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు చీటీ వెంకట్రావు,మాదాపూర్ సర్పంచ్ దారిశెట్టి రాజేష్, ఎంపిటిసి లతా రమేష్ ఉపసర్పంచ్ రాకేష్ వార్డు మెంబర్లు రాధా ,లక్ష్మి ,శ్రీజ, రమేష్ ,గంగాధర్ యువకులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ డాక్టర్ జన సురేష్ మాట్లాడుతూ నాకు ఈ గ్రామంతో ఉన్న అనుబంధం నా గ్రామం వరకు తీసుకు వచ్చిందని, ఇంకా చాలా చాలా చేసే పనులు ఉన్నాయని నేను చదువుకున్న స్కూల్ లో నే వచ్చి నేను ఈ విధంగా సహాయం చేయడం చాలా ఆనందంగానూ ఒక రకంగా బాధగా ఉందని అన్నారు. కరోనా వ్యాధికి సంబంధించిన జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు మరొకసారి మీకు మన గ్రామానికి ఎలాంటి సందర్భం లో నైనా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఎల్ఐసి రాజయ్య కార్యదర్శి ప్రశాంత్ పంచాయతీ సిబ్బందిని డాక్టర్ గారు సన్మానించారు తర్వాత గ్రామంలో ప్రతి ఇంటికి వస్తువుల్ని సర్పంచ్ వన తడుపుల అంజయ్య ఉప సర్పంచ్ రాకేష్ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో సరుకులు వేసుకుని అందజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here