ఉపాధి కూలీలకు మాస్కుల పంపిణి

0
135

రాయికల్ తాజాకబురు రూరల్: మండలంలోని జగన్నాథ్ పూర్, కుమ్మరిపెల్లి, శ్రీరాంనగర్, సింగర్రావుపేట, కిష్టంపేట, గ్రామాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా మాస్కులను పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో తమవంతు సామజిక బాధ్యతగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు, రైతులకు ఉచితంగా మాస్కులను పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయితీ కార్యదర్శులు,సర్పంచులు, ఆత్రం విజయ, చింతపెల్లి స్వప్న, కొంపెల్లి రాజమౌళి, దన్నపనేని రాంచందర్ రావు, జన స్వరూప, ఉపసర్పంచులు, ఆశా, అంగన్వాడీ, ఐకెపి, సిబ్బంది ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here