ఉద్యోగాలు భర్తీ చేయకుంటే-మిలిటెంట్ పోరాటానికి సిద్ధం.!!AIYF జిల్లా కార్యదర్శి శంకర్

0
22

హుస్నాబాద్ తాజా కబురు:ఉద్యోగాలకు, తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేనిచో మిలిటెంట్ పోరాటానికి సిద్ధమని AIYF జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ ప్రభుత్వన్ని హెచ్చరించారు. శనివారం రోజున అఖిల భారత యువజన సమాఖ్య AIYF హుస్నాబాద్, అక్కన్నపేట్,మండలాల మహాసభ స్థానిక మండల కేద్రంలో నిర్వహించారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మరియు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే నిరుద్యోగులను మోసం చేసిందని యువత చేతిలో రాష్ట్ర ప్రభుత్యాన్ని కుర్చీ దించక తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో సుమారుగా 2లక్ష ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని, ఇది నిరుద్యోగ యువతను మోసం చేసే కుట్రలో భాగమని, జిల్లాలో పారిశ్రమిక కారిడార్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయకుంటే నిరుద్యోగులతో కలిసి మిలిటెంట్ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో Aiyf మాజీ నాయకులు నిర్మాణ బాద్యులు, యెడల వనేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo లో నిరుద్యోగ సమస్యలు,ఉపాధి హక్కుల కై యువత ఇక ఉద్యమ బాటలో ఉప్పనై కదలాలి పిలుపునిచ్చారు . ఈ మహా సభా లో AIYF మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో AIYF జిల్లా సహాయ కార్యదర్శి జనగాం రాజ్ కుమార్ బిచ్చలా శ్రీనివాస్ ,తగురం స్వామీ ,
ఏలూరి సాయి ప్రసాద్, వేల్పుల ప్రవీణ్ , కె శ్రీనివాస్ ,అంజయ్య ,శివ ,పున్న సాయి కృష్ణ , మనీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here