ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్ల అమలు ఎప్పుడు

0
112

వరంగల్ లో విద్యార్థుల పై లాఠీ ఛార్జి చేసిన సిఐ ని సస్పెండ్ చేయాలి

రెడ్డి జేఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి

జగిత్యాల తాజా కబురు:కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకోసం విద్య, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లను ప్రకటించగా తెలంగాణలో వీటిని అమలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని రెడ్డి జేఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఈడబ్ల్యూఎస్ 10 రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన రెడ్డి కార్పోరేషన్ హామీని ‌తుంగలో తోక్కారని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన ఫైలుపై ఆమోదం కొరకు నాలుగు నెలల కిందట అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించినా వాటిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.ఓటు బ్యాంకు రాజకీయాల తో అగ్రవర్ణ పేదలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేయడం సరికాదన్నారు.అగ్రవర్ణ పేదల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన నిరుపేదలకు విద్యా ,ఉద్యోగ ,ఉపాధి, సంక్షేమ రంగాల్లో అన్యాయానికి గురవుతున్నామని వివరించారు..
ఆర్థిక స్థితి గతుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకు విద్య ,ఉద్యోగాల్లో కల్పించిన 10శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయక పోవడం తో అగ్రవర్ణ పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.ఎంసెట్ లో ఈడబ్ల్యూఎస్ ద్వారా అర్హత సాధించిన దాదాపు20 వేల మందికి ఈనెల12నుండి ప్రారంభమైన ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ 22వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈలోపు అగ్రవర్ణ పేదలకు 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేయాలని వరంగల్ లో ఉద్యమిస్తున్న విద్యార్థులపై పోలీసులు జరీపిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.విద్యార్థులపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసిన సిఐ ని సస్పెండ్ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.అలాగే ఎన్నికల హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణ లో ఈడబ్ల్యూఎస్ 10 రిజర్వేషన్లు అమలు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టడాన్ని రెడ్డి జేఏసీ సమర్థిస్తోందన్నారు. రెడ్డి జేఏసీ జిల్లా ప్రతినిధులు నాగిరెడ్డి రజితారెడ్డి, కుర్మ ప్రేమలతా రెడ్డి, ఎడ్మల వరలక్ష్మి రెడ్డి, పెద్ది మహేశ్వర్ రెడ్డి, మందల గోపాల్ రెడ్డి, తాటిపర్తి రాజేందర్ రెడ్డి , వేముల వసంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here