ఇటిక్యాల్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

0
164
Model School Application

జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలంలోని ఇటిక్యాల్ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్‌ 15 నుంచి 20వరకు అవకాశం ఉందని, 7వ తరగతి నుంచి 10వ తరగతుల్లో మిగిలిన సీట్లకు ఏప్రిల్‌ 20 నుంచి 30వరకు అవకాశం ఉందని ఆయన అన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి జూన్‌ 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష ఉంటుందని, 7నుంచి 10వ తరగతిలో ప్రవేశానికి జూన్‌ 5న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్‌ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here