ఇంటింటికీ ఆత్మ నిర్బర్ భారత్ ను గురించి ప్రచారం చేయాలి

0
185

రాయికల్ తాజా కబురు: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండవ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సర కాలంలో సాధించిన విజయాలను,అభివృద్ధి పథకాలను ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా మండలంలోని అయోధ్య గ్రామంలో భాజపా నియోజకవర్గ ఇంచార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంబించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతు ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా అధికార ప్రతినిధి చిలుకమర్రి మదన్ మోహన్, మండల ప్రధాన కార్యదర్శి అన్నవేణి వేణు, ఎంపీటీసీ ఆకుల మహేష్, ఉపసర్పంచ్ రవీందర్,గ్రామ భాజపా అధ్యక్షులు జితేందర్,నాయకులు పసుపుణురి శ్రీనివాస్,తిప్పిరెడ్డి రాజశేఖర్,మెక్కొండ రాంరెడ్డి,బొడ్గం శ్రీకాంత్,అనుగంటి రాజశేఖర్, రాజ్ కుమార్,రాజేష్,రవి,శ్రవణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here