ఇంకా ఎన్నీ గుండెలు ఆగిపోవాలి, గల్ఫ్ కార్మికుల ఆక్రందన వినె నాధుడె లేడా,యన్.ఆర్.ఐ పాలసీ అమలు చెయ్యాలని గల్ఫ్ కార్మికుల వేడుకోలు…

0
514

ఇంకా ఎన్నీ గుండెలు ఆగిపోవాలి, గల్ఫ్ కార్మికుల ఆక్రందన వినె నాధుడె లేడా,యన్.ఆర్.ఐ పాలసీ అమలు చెయ్యాలని గల్ఫ్ కార్మికుల వేడుకోలు...

గల్ఫ్ లో గుండెపోటు తో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన మేంసైతం పౌండేషన్ సభ్యులు…

(గల్ఫ్ లో గుండెపోటుతో మ్రుతి చెందిన మాదాపూర్ గ్రామవాసి)

 

తాజకబురు న్యూస్: ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకు బారమై ఎడారిదేశాలకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుందామంటె అక్కడ పనులు లేకా కొందరు, ఇక్కడ ఏజెంటు చెప్పిన పనులు దొరుకకా కొందరు, స్వదేశానికి రాలేకా, అక్కడ ఉండలేకా నరకయాతన పడుతున్నారు. సంవత్సరాలు గుడుస్తున్న గల్ఫ్ బాధితులపై మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలలు లేకుండా పోయాయి, మన తెలంగాణలోనె ఎన్నో ఉపాధి అవకాశాలు ఉండగా విదేశాలకు ఎందుకు వెళుతున్నారని ముఖ్యమంత్రి కేసి.ఆర్ మొన్న విలేఖర్ల సమావేశంలో అన్నారు, కట్టుకున్న ఆలీని, కన్న తల్లీదండ్రులను, అల్లారుముద్దగా చూసుకోవల్సన పిల్లలను వదిలి వేల కిలోమీటర్లు సగటు తెలంగాణ వాసి ఎందుకు వెళుతున్నాడు అదీకూడా లక్షల్లో అప్పులు తెచ్చుకుని అని ఒక్కసారీ ఆలోసిస్తె తెలంగాణ సీయం కు తెలిసి ఉండేది, ఓ పక్క ఎజెంటుల మోసాలతో మరో పక్క తీవ్రమైన ఎండలో పనిచేస్తూ ఆనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు,తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకా, మనస్తాపానికి గురిచెంది గుండెపోటులతో మ్రుతి చెందుతున్నారు, విదేశాల్లో మ్రతి చెందిన వాళ్ల మ్రుతదేహాలను స్వదేశానికి గతంలో ఎక్కువ సమయం పడుతుండె కానీ మా ప్రభుత్వంలో అతి తక్కువ సమయంలో తీసుకొస్తున్నామంటున్నారె కానీ వారికోసం యన్.ఆర్.ఐ పాలసీ మాత్రం అమలు చెయ్యలేదు…గల్ఫ్ లో మనుషున్న మారాజులు (గుండెల్లి నర్షింహా) లాంటి వాళ్లు భాద్యతలను తమ పైన వేసుకుని పంపిస్తెగానీ మన ఇండియాకు వచ్చె పరిస్తితి లేదు, తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన జంగ సుదర్నణ్ గుండెపోటుతో మరణించాడు, అదె గ్రామానికి చెందిన పలువురు మ్రుతదేహాన్ని ఇండియాకు తీసుకురావటానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నారు, వారికి అండగా నిలిచి మానవసేవయె మాదవ సేవగా బావించిన నరసింహా సుదర్నణ్ శవాన్ని ఇండియాకు పంపించాటానికి ఎంతో శ్రమపడ్డాడు, అతనితో పాటు గ్రామానికి చెందిన బాదినేని వెంకటేశ్ ఇంకా అక్కడనున్న గ్రామస్తులు సాయం చేశారు..

మేం ఉన్నామని  సుదర్నణ్ కుటుంబానికి ఆసరాగా నిలిచిన ’మేం సైతం పౌండెషన్’’

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన జంగ  సుదర్శన్ జనవరి 1వ తేదిన గుండెపోటుతో మరణించాడు .వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నా గ్రామానికి చెందిన “మేము సైతం పౌండేషన్” సభ్యులు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా సుదర్శన చిన్న కూతురైన జంగా మాధురికి 55116/- రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈరోజు కుటుంబ సభ్యులకు అందించారు.. ఆడపిల్లకు అండగా నిలుద్దామని ఈ కార్యక్రమం చేపట్టామని ,సమస్యలో ఉన్న వారికి తమవంతు సాయం చేస్తామని పౌండేన్ సభ్యులు అంటున్నారు.గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న ’మేంసైతం’ ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టం పట్ల అందరు అభినందిస్తున్నారు…

ఈ సందర్బంగా గల్ఫ్ కార్మికులు మాట్లాడుతూ….సుదర్నణ్ లాంటి ఎన్నో కుటుంబాలు బతుకుపోరాటం చేస్తున్నాయని, యన్.ఆర్.ఐ పాలసీ అమలు చేస్తె తమకు ఓ భరోషా ఉంటుందని అంటున్నారు.ప్రభుత్వం ఇకనైన యన్,ఆర్,ఐ పాలసీ అమలు చెయ్యాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here