ఆ భూమి మాదే సారు..ఆదుకోండి

0
84

మల్లాపూర్ తాజా కబురు: ఏండ్లనుండి సాగుచేసుకుంటున్న భూమిని తమకు కాకుండా చేద్దామని కక్షతో గ్రామానికి చెందిన మహిళలని ఉసిగొలిపి సాగు చేసిన పంటని కోపించి అన్యాయంగా పంటను నాశనం చేశారని మండలంలోని గుండంపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతులు మార్గం మమత,మార్గం వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వారు పత్రికా విలేకరుల ముందు ఆపదలో ఉన్నాం సారు ఆదుకోండని బోరున విలపించారు. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 109/5,లో 6 ఎకరాల 35 గుంటలు, 109/4లో 4ఎకరాల 3 గుంటలు మా కుటుంబ సభ్యుల పేరున 109/3 లో 3 ఎకరాల 4 గుంటలు, రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 14 ఎకరాల 9 గుంటల భూమి తమ పేరున ఉంది ప్రభుత్వ పథకాలైన రైతు బంధు లబ్ధిని పొందుతుండగా గత రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు మహిళలలతో మా భూములలోని వరి,చెరుకు పంటలను పూర్తిగా కోసివేశారంటు,నెల రోజుల్లో కోతకు వచ్చే పొలాన్ని కోసి నష్టాల ఊబిలో నెట్టేశారని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంట పొలం కోసే మహిళలకు నచ్చ జెప్పే ప్రయత్నం చేసిన వారు వినలేదని భూ మాఫియా, బడా నాయకుల అండతో కొందరు మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని తమకు ప్రాణ భయం ఉందని ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమైనారు. ఈ విషయం పై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని భాదిత మహిళలు వేడుకుంటుంన్నారు.

చేతికచ్చిన పంటను కోసేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here