ఆ నలుబై లక్షలు బీజెపి అభ్యర్థి రఘునందన్ రావు వే…

0
144

ఆ నలుబై లక్షలు దుబ్బాక బీజెపి అభ్యర్థి రఘునందన్ రావు వే…

ఎన్నికలు వస్తున్నాయంటె డబ్బులను యదేచ్చగా తరలించటం రాజకీయ నాయకులకు అలవాటే…ఇప్పుడు మళ్లీ అది రిపిట్ అయింది,ఉప ఎన్నికల్లో డబ్బులు తరలిస్తున్న నేపథ్యంలో పోలిసులు పట్టుకున్నారు…

తాజాకబురు రిపోర్టర్ దుబ్బాక:

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా యి. టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్ రావు రంగం లోకి దిగగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. అయితే ఎన్నికల్లో ప్రలోభాల కోసం భారీగా నగదును తరలిస్తున్నారు. తరలిస్తున్న ఆ డబ్బును శామీర్ పేట వద్ద పోలీసులు పట్టుకున్నారు,శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద రూ. 40 లక్షల నగదు పోలీసులకు పట్టుబడింది. తనిఖీలు నిర్వహిస్తుండగా నగదు లభ్యమయ్యిందని పోలీసులు తెలిపారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘు నందన్‌రావు కు ఇచ్చేందుకే నగదు తీసుకెళ్తున్నట్లు బాలానగర్‌ డీసీపీ పద్మజ తెలిపారు డ బ్బు తీసుకొస్తున్న వారితో రఘునందన్‌రావు పీఏ ఫోన్‌ మాట్లాడిన ఆడియో గు ర్తించామని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలకు వి రుద్ధంగా డబ్బు తీసుకెళ్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.పటాన్‌చెరు నుంచి సిద్ది పేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని అయితే దీనిపై రఘునందన్ రావు బీజేపీ నేతలు స్పందించాల్సి ఉంది. కానీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంత మొత్తంలో నగదు పట్టు బట్టడం చర్చకు దారితీసింది. మరోవైపు నేతలు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఆరోపణ లు-ప్రత్యారోపణలతో ఉప పోరు హీటెక్కింది. సరిగ్గా ఈ సమయంలో నగదు పట్టుబడటం కలకలం రేపు తోంది.దుబ్బాకలో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత బరిలో నిలవగా బిజెపి నుండి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here