ఆసియాఖండంలోనె అత్యంత అరుదైన పాలరాతి శివుడు ఎక్కడున్నాడంటె…

0
109

సాధరణంగా శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్నణమిస్తె ఇక్కడ మాత్రం నిజరూపంలో దర్నణమిస్తాడు,ఆసియాఖండంలోనె అత్యంత అరుదైన అతిపెద్ద విగ్రహాంగా ప్రసిద్ది పొందింది, సాక్షాత్తు శివుడె కళ్లముందు దర్నణమిచ్చినట్టు కనిపిస్తాడు, అదెక్కడో తెలుసుకోవాలంటె జగిత్యాల జిల్లా వెళ్లాల్సిందె…

తాజాకబురు ప్రతినిధి మేడిపల్లి: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట్ లో కొలువైన ఈ శివుడి ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలంటె ఎన్నో ఉన్నాయి, ప్రతి శివాలయంలో లింగాకారంలో శివుడు దర్నణమిస్తె ఇక్కడ మాత్రం నిజరూదర్నణం ఉంటుంది. 1965 సంవత్సరంలో ఇదె గ్రామానికి చెందిన అడ్లగట్ట గంగారాం, ముంబాయిలో పని చేస్తుండెవాడు, ఈ నేపధ్యంలో ఆయనకు గ్రామంలో శివుడి విగ్రహం ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచన వచ్చి తాను ఉంటున్న ప్రాంతంలో పాలరాతి విగ్రాహాల తయారి వద్దకు వెళ్లాడు, అక్కడ పాలరాతి శివుడి విగ్రహాన్ని తయారు చేయించాలని అనుకున్నాడు, తన గ్రామం కోసం పరమేశ్వరుడిని ప్రతిష్టించాలని విగ్రహం తయారు చేయించి గ్రామంలో చిన్న గుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు, అప్పటి నుండి గ్రామంలో అన్ని మంచి జరగటం ప్రజలు గమణించాడు, కరువుకాలం వచ్చిన అక్కడి నీరు సంవ్రుద్దిగా ఉండటం, ఎలాంటి సమస్యలు రాకపోవటంతో శివుడె ఆ గ్రామాన్ని రక్షిస్తున్నాడని అక్కడి ప్రజలు నమ్మారు. అప్పటినుండి ఆ చిన్న గుడిని పెద్ద నిర్మాణం చేపట్టి అరుదైన ఆలయంగా తయారు చేశాడు.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినంగా ఇక్కడమూడురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి, శ్రీరామ నవమి, దీపావళీ, ఉగాది పండగలను ఘనంగా నిర్వహిస్తారు.ప్రతి సోమ, శనివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఈ ఆలయం కొలిచినవారికి కొంగుబంగారంగా ఉంటుంది, సంతానం లేనివాళ్లు ఈ ఆలయానికి వచ్చి తమ మొక్కు చెల్లించుకుంటె సంతానం అవుతుందని భక్తులు నమ్ముతారు, పాలరాతి విగ్రహాం కావటం వల్ల నిజామాబాద్, కరీంనగర్, ముంబాయి, పుణె, ఆదిలాబాద్ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.తమ గ్రామాన్ని రక్షించె పరమశివుడు తమ గ్రామానికి ఎంతో తోడుగా ఉంటున్నాడని అందుకె ప్రతి రోజు ఆయన సేవాలో తరిస్తామని అక్కడివారు చెపుతున్నారు.శివరాత్రి కి మూడు రోజుల ముందునుండి ఇక్కడి మహిళలు నిలారంతో ఎంతో భక్తిశ్రద్దలతో ఉంటారు అలాగె శివరాత్రి సందర్బంగా మూడురోజుల్లో స్వస్తిపుణ్యవచనం, స్తాపితదేవతలపూజ, అభిషేకములు, స్వామీవారి కళ్యాణం, జాగారణ, లింగోద్బావన, రధొత్సహాం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తామని అక్కడి భక్తులు చెపుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here