ఆశ.ఏ.యన్.ఎమ్ లతో సమీక్ష నిర్వహించిన ఎంపీ.టీ.సీ

0
297

రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో కరోనా మహమ్మారి నివారించడంలో భాగంగా స్థానిక ఎంపీటీసీ రాజనాల మధుకుమార్ బుధవారం ఆశ.ఏ.యన్.ఎమ్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రం నుండి గ్రామానికి తిరిగి వచ్చే వారి వివరాలు, గ్రామం నుండి వలస వెళ్లే వారి వివరాలను స్థానిక అధికారులకు తెలుపుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను గురించి అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీ.ఆర్వో కొమురయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్,ఏ.ఎన్ఎం హేమలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here