ఆర్థిక సాయం అందించిన సైనికులు

0
17

తాజా కబురు రాయికల్:  దేసేవలో తరిస్తూనే… సెలవుల్లో కూడా సామాజిక సేవలు చేస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన భారత ఆర్మీ జవాన్లు. “జయహో జనతా జవాన్” పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ తయారు చేసి ఇందులో భారత సైన్యంలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఉద్యోగులందరినీ సభ్యులుగా చేర్చారు. వీరిలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు.. ఈ గ్రూపు సహాయంతో తెలుసుకుని.. స్థానికంగా అందుబాటులో ఉన్నవాళ్లు, సెలవుల్లో వచ్చిన వాళ్లంతా కలిసి వారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన దామోదర్ రాజు అనే జవాన్ తల్లి కళావతి క్యాన్సర్ తో చనిపోగా.. అందుబాటులో ఉన్న పది మంది తోటి సైనికులు ఆ ఇంటికి వెళ్లి తామున్నామంటూ భరోసా కల్పించారు. క్సాన్యర్ చికిత్స కోసం అప్పులు చేసిన దామోదర్ రాజుకు తమ వంతుగా 40 వేల ఆర్థిక సహాయం అందించారు. దామోదర్ రాజు తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోగా.. ఆర్మి ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే తల్లి కళావతి క్యాన్సర్ భారిన పడింది. లాక్ డౌన్ కు ముందు ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోస్టింగ్ కు వెళ్లిన దామోదర్ రాజుకు తల్లి అనారోగ్యం గురించి తెలుసుకుని లీవులో వచ్చాడు. గత మూడు నెలలుగా అప్పులు చేసి హైదరాబాద్ లో తల్లికి చికిత్స ఇప్పించాడు. కానీ ఫలితం లేకపోయింది. కళావతి కన్నుమూయడంతో దుఃఖంలో ఉన్న దామోదర్ రాజును పరామర్శించేందుకు అందుబాటులో ఉన్న ఉమ్మడి జిల్లాకు చెందిన నవీన్ కుమార్, కిషోర్, మల్లేశం, రాకేష్, మహేశ్, నవీన్, రవీందర్, శ్రీనాథ్ అనే పది మంది సైనికులు ఇవాళ దామోదర్ రాజును కలిసి 40 వేల ఆర్థిక సహాయం అందించారు. మరో పది రోజుల్లో దామోదర్ రాజు సెలవులు పూర్తి కానుండటంతో తిరిగి విధుల్లో చేరాల్సి ఉందని.. వీరి నిరుపేద కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని వారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here