ఆరేండ్లలో వందేండ్ల ప్రగతి-జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

0
129

జగిత్యాల తాజా కబురు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్లలో వందేండ్ల ప్రగతి సాధించిందని, నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లా పలు రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.విద్యా,వైద్యరంగాల్లో ఎనలేని ప్రతిభ కనబరుస్తు రాష్ట్రంలో జిల్లా అగ్రస్దానంతో పాటుగా విద్యారంగంలో మూడు సార్లు రాష్ట్రంలోనే టాప్ లో నిలిచి హ్యాట్రిక్ సాధించిందన్నారు.అధికారులు,నాయకుల సమిష్టి కృషి ఫలితంగానే జిల్లా ముందంజలో ఉంటుందని కాళేశ్వరం జలాల ఫలితంగా జిల్లాలో చెరువులు నిండి మత్తడి దూకడమే కాకుండా యావత్ రైతాంగానికి పంటలకు ఎలాంటి ఢోకా లేకుండా ఉందన్నారు.పంట విస్తీర్ణం పెరగటమే కాకుండా రైతులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీసీఈవో,.జడ్పీటీసిలు రాజేందర్ రావు, భూమయ్య, అశ్విని, మహేష్, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here