ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని భాజపా నాయకుల వినతి

0
94

తాజా కబురు జగిత్యాల: ప్రధానమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తూ, కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహించి, ప్రభుత్వం ఉచితంగా అందరికీ మాస్కులు శానిటైజ ర్లు అందజేయాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బి రాజేశం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పరీక్షలను తక్కువగా చేస్తూ కేసుల నమోదు తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల లో ఫీజులపై నియంత్రణ లేకుండా పోయిందని, ప్రజలు కరోనా తో ఆసుపత్రిలో చేరితే ఆక్సిజన్ సదుపాయం లేక అవస్థలు పడుతున్నారని, కోవిడ్ వైద్యాన్ని అత్యవసర సేవలు గా భావించి ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు కల్పించి, ఆక్సిజన్ వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు జుంబర్తి దివాకర్ భాజపా మత్స్యశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి , పుప్పల ప్రభాకర్, బీజేవైఎం జిల్లా నాయకులు వేముల కృష్ణ ,నాయకులు సాయి గణేష్,రాగిల్ల ప్రణయ్, రాంబాబు, రాగిల్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here