ఆన్లైన్ లో ప్రాథమిక సైబర్ సెక్యూరిటి కోర్సు పూర్తి చేసిన మైతాపూర్ బుడతలు

0
711

సర్టిఫికెట్లను అందిస్తున్న ఎం.పి.టి.సి రాజనాల మధు కుమార్

10 రోజుల శిక్షణ -కోర్సు అంతా అంతర్జాలంలోనే

తాజా కబురు జగిత్యాల- రాయికల్: అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్ రావడం, మీ ఖాతాలో నగదు జమ చేస్తాం బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండి, ఆన్లైన్ స్మార్ట్ ఫోన్లో అనవసర వెబ్సైట్ లింకులు క్లిక్ చేయడంతో ఖాతా నుండి డబ్బులు మాయమైన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సైబర్ నేరాలను గురించి అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా 6 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కోసం సైబర్ సెక్యూరిటి ప్రోఫెషినల్ బేసిక్ కోర్సును ప్రారంభించింది.
రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి మోక్షిత జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతి బాపులే సంక్షేమ పాఠశాల లో 8వ తరగతి, పెద్దిరెడ్డి మోక్షిత్ రాయికల్ మండలం సింగరావుపేట్ లోని మహాత్మ జ్యోతి బాపులే సంక్షేమ పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేసి కరోనా కాలంతో ఇంటివద్దనే ఉంటున్నారు. రాయికల్ కు చెందిన అయ్యప్ప డిజిటల్ సేవ కేంద్రం ద్వారా సైబర్ సెక్యూరిటి కోర్సు లో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు వాట్సాప్ లో వచ్చిన మెస్సేజ్ ను చూసి,డిజిటల్ సేవ కేంద్రం సమన్వయ కర్త ఫోన్ నెంబర్ తీసుకొని కోర్సు వివరాలను, రిజిష్ట్రేషన్ కోసం తమ వివరాలను వాట్సాఆప్ ద్వారా పంపారు. 10 నిమిషాల్లో రిజిష్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు వారికీ యూసర్ నేమ్, పాస్వర్డు మెస్సేజ్ రాగానే అక్క, తమ్ముడు ఇద్దరు కోర్సును నేర్చుకోవడం ప్రారంభించారు.

కోర్సు అంతా అంతర్జాలంలోనే:

రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు యూసర్ నేమ్, పాస్వర్డు తో ఢిల్లీలోని కామన్ సర్వీస్ సెంటర్ అకాడమీకి చెందిన వెబ్సైట్ ద్వారా లాగిన్ చేసుకున్నాక అందులో ఇంగ్లిష్, హిందీ భాషా లలో 10 అంశాలలో విద్యార్థులకు అర్థమయ్యేలా కంప్యూటర్ వినియోగం,ఇంటర్నెట్ లో ఎలాంటి వెబ్సైట్లను ఓపెన్ చేయాలి,ఓటీపీ సమాచారాన్ని ఇతరులకు తెలుపకపోవడం,వైరస్, ఆంటీ వైరస్ వినియోగం తదితర వీడియో మాడ్యూల్ సమాచారం వినాల్సి ఉంటుంది. విన్న సమాచారంతో 10 రోజుల పాటు ఒక్కో అసైన్మెంట్ ను మల్టీపుల్ తరహా 25 ప్రశ్నలకు ఒక గంట వ్యవధిలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 అసెస్ మెంట్ లను పూర్తి చేసి సరైన సమాధానాలు చేసిన వారికీ ఢిల్లీ సి.ఎస్.సి అకాడమీ నుండి కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ వస్తుంది.

కొత్త విషయాలు నేర్చుకున్న-మోక్షిత:ఆన్లైన్ ద్వారా కోర్సు పూర్తి చేయడం చాల ఆనందంగా ఉంది. కోర్సుకు సంబంధించిన కొన్ని విషయాలు కంప్యూటర్ కి సంబంధిచిన ప్రశ్నలు సమాధానాలు వినటం ఆశక్తిగా ఉండేది.తెలియని విషయాలను గూగుల్ లో సేర్చి ఇంజన్ ద్వారా తెలుసుకోవడం పది రోజులు తరగతి లో ఉపాధ్యాయులు చెప్పినట్లుగా అనిపించింది. ఢిల్లీ సి.ఎస్.సి అకాడమీ ద్వారా సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉంది.

వీడియో తరగతులు ఆశక్తిగా ఉంటాయి-మోక్షిత్:ప్రతి రోజు ఒక్కో వీడియో క్లాస్ ని వినడం అందులో మనిషి రూపంలోని బొమ్మల సహాయంతో ఉన్న సంబాషణలు చాల ఆశక్తిగా ఉంటాయి. అర్థం కానీ అంశాలను అక్కయ్య మోక్షిత వివరించేది. పరీక్ష సమాధానాల్ని గుర్తించటం సులభంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here