ఆటో డ్రైవరులకు బియ్యం పంపిణీ చేసిన రైసుమిల్లు యజమాని

0
154

కోరుట్ల తాజా కబురు: ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై తెలంగాణ రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించడంతో గత నెల 22నుండి 38 రోజులుగా కోరుట్ల పట్టణంలో వున్న దాదాపు 200 ఆటోలు నడవనందున వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురు కావడంతో వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న రైసుమిల్లు యజమాని వారి బాధలకు చలించి పట్టణానానికి చెందిన కొత్త సురేష్ ఆటో డ్రైవర్లకు రైసుమిల్లు ఆవరణలో 100 మందికి ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యం సంచులను పంపిణీ చేసి వారి ఉదారతను చాటుకున్నారు. ఇందుకు రైసుమిల్లు యాజమానికి ఆటో డైవర్ల తరుపున కార్మిక సంఘ నేతలు జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, కార్యదర్శి ఎం.డీ. ముక్రమ్, హరి భూషణ్, రాంబాబు, గణేష్, దరంసింగ్, రాహుఫ్ తదితరులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మిగిలిన ఇంకా 100 మంది ఆటో డ్రైవర్లకు రెండోవ విడతగా త్వరలో బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఆటోలు నడవనందుకు వారు బ్యాంకులలో రుణం కిస్తులు, వడ్డీ కిస్తులు, నెలసరి ఇంటిఅద్దె, కరెంట్ బిల్లులు కట్టలేని స్థితిలో వున్నారని, అలాగే నిత్యవసర వస్తువులు, పప్పులు, కూరగాయలు, నూనెలు, సబ్బులు, పాలు, కొనలేని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారని కావున వారికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రతి ఒక్కరికీ 10 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందజేయాలని స్థానిక తహసీల్దార్ ను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here