ఆగస్టు నెలలో 7 తారీకు, 7 గంటలకు పాపకు జన్మనిస్తా: సమంత

0
380

 

హైదరాబాద్:టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తన సో షల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత సెటైరికల్ సమాధానం ఇచ్చింది.సమంత మీరెప్పుడు తల్లికాబోతున్నారనే ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ 2022 సం వత్సరం, ఆగస్టు 7వ తేదీ, ఉదయం 7 గంటలకు ఓ పాపకు జన్మనిస్తానని చెప్పింది. అంతేకాకుండా ఆ వీడియోను కూడా సమంత సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.కాగా సమంత అక్కినేని తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్ర కారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. పె ళ్లికి ముందు తర్వాత హీరోయిన్‌గా సమంత ఓ వెలుగు వెలుగుతోంది. ఈ ఏడాది భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ ఆ తర్వాత సోలో లీడ్‌గా వ చ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది.సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది.సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here