అయిదు కుటుంబాలను ఇంట్లోకి వెళ్లకుండా ఇంటిముందు గోడ కట్టినారు …..

0
199


పురుగుల మందుతో రోడుపై బైటాయించిన కుటుంబాలు…..

తాజా కబురు మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పొన్నం నారాయణ కు నలుగురు కొడుకులు,గత నలుబై సంవత్సరాల క్రితం గ్రామంలోని మల్లన్న ఆలయం సమీపంలో ఓ వ్యక్తి వద్ద ఇళ్లు కొనుగోలు చేసారు,ఇళ్లు శిథిలావస్థకు చేరుకొవటంతో పాత ఇళ్లను కూలగొట్టి నూతనంగా నలుగురి కొడుకులకు నాలుగు ఇళ్లు నిర్మించుకున్నారు,అయితె నారాయణ ఇంటిపక్కనె మరో అతను భూమి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నాడు,ముప్పై సంవత్సరాలనుండి ఇళ్లు దారిలో నడుస్తున్న భూమి మీదికాదని ఇళ్లల్లోకి వెళ్లకుండా గోడ నిర్మించారని,నాలుగు కుటుంబ సభ్యులు మూడురోజులుగా వేరె ప్రాంతంలో బ్రతకాల్సి వస్తుందని ఆరోపిస్తు ఈ రోజు పెద్దాపూర్ గ్రామంలో పురుగుల మందుతో తమకు న్యాయం చెయ్యాలని బైటాయించారు…తమ ఇంటికి దారి లేకుండా ఇంటిలోపలికి ఎలా వెళ్లాలి అంటే ఇంటితో కలిసి ఉన్న రేకుల షెడ్దు కులదోసుకో అంటున్నారని,ఇదె విషయం పోలిసులకు,రెవెన్యూ అధికారులకు,కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here