అమ్మ..నాన్న ఎప్పుడు వస్తాడు.. గల్ఫ్ లో 6నెలల క్రితం అదృశ్యమైన మేడిపల్లి మండలం మన్నెగూడెం వాసి…

0
456
తాజాకబురు
తాజాకబురు

ఆర్టికల్: నాగిరెడ్డి రఘుపతిరెడ్డి

తాజాకబురు డెస్క్: ఇద్దరు పిల్లలు, వారి ఆలనపాలన చూసుకుంటు గ్రామంలో చిన్న హోటల్ నడిపిస్తు వచ్చె డబ్బులతో కుటుంబాన్ని పోసించుకునెవాడు హారిప్రసాద్, అప్పటికె పిల్లలు పెద్ద అవుతున్నారు, వారికి ఉన్నత చదవులు చదివించాలంటె ఆర్థిక పరిస్థితి బాగుండాలనుకున్నాడు, అందుకె ఉన్న ఊరును కాదనుకొని విదేశాలకు వెళ్లాడు, కష్టం చేసి కుటుంబాన్ని పోసిస్తాననుకున్న అతనికి ఏమైందో తెలియదు 6 నెలలుగా అద్రుశ్యమైపోయాడు, అమ్మ ..నాన్నతో ఒక్కసారి ఫోన్ లో మాట్లాడించవా అనె చిన్ని హ్రుదయాలకు తల్లీ కన్నీరుతో మాత్రమె సమాదానం ఇస్తుంది, దుబాయ్ లో అద్రుశ్యమైన తన భర్తను కాపాడాలని వేడుకుంటుంది…

తన భర్తను వెతికి ఇండియాకు తెప్పించాలని వేడుకుంటున్న దృశ్యం

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నేగూడెం గ్రామానికి చెందిన శ్రీరాముల హరిప్రసాద్ గ్రామంలో చిన్న హోటల్ నడిపిస్తు కుటుంబాన్ని పోసించుకునెవాడు, అతనికి బార్య నీరజ, కొడుకు పవన్,కూతురు రక్షిత లు ఉన్నారు, గ్రామంలో హోటల్ ద్వార వచ్చె డబ్బులు పొట్ట,బట్టకు మాత్రమె సరిపోతున్నాయి, పిల్లలు పెద్దవుతున్నారు ఒక్కసారి దుబాయ్ వెళ్లోస్తా అని కోరుట్ల కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా దుబాయ్ కి ఓ కంపెనీ తనకు వచ్చె పని హోటల్ పనిపై 2 లక్షలు చెల్లించి విసాతో గత సంవత్సరం డిసెంబర్ 27 రోజున దుబాయ్ వెళ్లాడు, అయితె కరోనా నిభందనల వల్ల ఖచ్చితంగా 10 రోజుల పాటు క్వారెంటన్ లో ఉండాల్సి రావటంతో 10 రోజులు క్వారెంటైన్ లో ఉన్నాడు, జనవరి 5 న కంపెనీ తనకు కేటాయించిన రూం కు పంపించారు,

దుబాయ్ వెళ్లి అక్కడ ఆదృశ్యం అయిన హారిప్రసాద్

అయితె కంపెనీ అతనికి మెడికల్ పరీక్షలు నిర్వహించి జనవరి 19 రోజు నుండి ఢ్యూటీకి హాజరు కావాలని తెలిపింది, హరిప్రసాద్ కు కంపెనీ రూం కేటాయించింది, జనవరి 18 రోజు బయటకు వెళ్లోస్తాను అని చెప్పి వెళ్లిన హారిప్రసాద్ అప్పటి నుండి అద్రుశ్యమయ్యాడు,హారిప్రసాద్ నుండి పోన్ రాకపోవటంతో అతని భార్య, తనకు తెలిసిన వారి ద్వార అతను ఉన్న రూం వాళ్లతో మాట్లాడితె తమకు తెలియదని సమాదానం వచ్చింది, అలాగె హారిప్రసాద్ కు చెందిన లగేజీ అంత రూంలోనె ఉందని వారు తెలిపారు, విషయం తెలుసుకున్న కంపెనీ సిబ్బంది దుబాయ్ పోలిసు స్టేషన్ లో మిస్సింగ్ అయినట్టు ఫిర్యాదు చేశారని అక్కడివారు నీరజకు తెలిపారు, మరీ హారిప్రసాద్ ఏమైనట్టు, 6 నెలలుగా ఇంటికి పోన్ చెయ్యలేదని, తన పిల్లలు నాన్న కావాలని ఏడుస్తున్నారని కన్నీరుమున్నీరవుతుంది, తన భర్త ఎక్కడ ఉన్నాడో వెతికి తమకు అప్పగించాలని వేడుకుంటుంది, ఉన్న ఊర్లో ఉపాధి కరువై విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదిస్తా అనుకున్న హారిప్రసాద్ ఎక్కడ ఉన్నడో వెతికి ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here