అమ్మ అలిగింది

0
432

అమ్మ అలిగింది..
20 సంవ‌త్స‌రాల నుండి రోజుకు 40 టీలు-ప‌ల్లీల‌తోనె జీవ‌నం…
 అవును ఆ అమ్మ అలిగింది, ఒక‌టో రెండో రోజులు కాదండీ ఏకంగా 20 ఏళ్లుగా అమె అల‌క‌మాన‌లేదు,అన్నం తిన‌లేదు…

అమ్మ అలిగింది
రాయికల్ తాజా కబురు: వివాహం అనేది ఇద్ద‌రు మ‌నుషుల‌కు సంభందించిన‌ది కాదు, రెండు మ‌న‌సుల‌కు సంభందించినా విష‌య‌మ‌ని చాలా మంది అంటుంటారు, ఇది అక్ష‌రాల నిజం అన‌టానికి ఈ స్టోరీ నిద‌ర్శ‌ణం.

జ‌గిత్యాల్ జిల్లా రాయిక‌ల్ మండ‌లం మైతాపూర్ గ్రామానికి చెందిన  ఇమె పేరు ఖాజ‌మ్మ. చిన్న‌వ‌య‌సులోనె ఖాజ‌మ్మ త‌ల్లీతండ్రులు ఆమెకు వివాహం చేశారు, అయితె భ‌ర్త అంటె ఇష్టం లేని ఖాజ‌మ్మ అత్తారింటికి వెళ్ల‌న‌ని మెండికేసి కూర్చుంది, రెండురోజులు బ్ర‌తిమిలాడిన ఖాజ‌మ్మ తండ్రి అయూబ్‌, అత్తారింటికి వెళ్ల‌నిదానికి అన్నం పెట్ట‌డం దండుగ ఈ రోజు నుండి అన్నం పెట్ట‌వ‌ద్ద‌ని త‌న బార్య అనిబీ అదేశాలు జారీ చేశాడు. వారం పాటు అన్నం తిన‌కుండా ఉన్న ఖాజ‌మ్మ అలిగింది, అప్పుడు అలిగిన ఖాజ‌మ్మ ఇరువై సంవ‌త్స‌రాలు అవుతున్న ఇంకా అల‌క‌మాన‌లేదు, అన్నం తిన‌లేదు, అన్నం తిన‌మ‌ని త‌ల్లీదండ్ర‌లు ఎన్నిర‌కాల బ్ర‌తిమిలాడిన అమె ఒప్పుకోలేదు , అ క్ష‌ణం అన్నం తిన‌టం మానేసినా ఖాజమ్మ అమ్మ‌నాన్న‌లు చ‌నిపోయిన త‌ర్వాత కూడా తిన‌లేదు. రోజుకు సుమార్ 40 టీలు, సంవ‌త్స‌రానికి క్వింటాల్ ప‌ల్లీలు తింటుంది. అన్నం తిన‌కుండా ఉండ‌టం వ‌ల్ల ఖాజ‌మ్మ‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాలేవు, మ‌రి మీరు అల‌క‌మానీ అన్నం తిన‌చ్చు క‌దా అంటె మాత్రం నేను అల‌క‌మాన‌ను , అన్నం తిన‌ను అని అంటుంది.కొంద‌రు మెండిగా ఉంటారు అంటారు, ఆ మెండిత‌నం సంవ‌త్స‌ర‌మె రెండు సంవ‌త్స‌రాలో ఉంటుంది కానీ 20 ఏళ్లుగా అన్నం తిన‌కుండా ఉంటుందా అన‌టానికి ఖాజ‌మ్మ క‌థ‌ను చూస్తె తెలుస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here