అమి’తొ’త్సవంలో బీజెపి శ్రేణులు,రంగంలోకి అమిత్ షా : జీహెఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న బీజేపీ అగ్రనేతలు.

0
29

హైదరాబాద్ తాజాకబురు ప్రతినిధి శ్రీపాద అభిషేక్ : జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు రానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు జీహెచ్ఎంసీలు ప్రచారం నిర్వహించనున్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ కేంద్ర నాయకత్వం అత్యంత సీరియస్ గా తీసుకొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ను ఆ పార్టీ ఇంచార్జీగా నియమించింది.ఈ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు కీలక నేతలను కూడా పలు డివిజన్లకు భాద్యతలను అప్పగించింది. జీహెచ్ఎంసీలో ప్రత్యర్ధుల ప్రచారం బీజేపీ అభ్యర్ధులు ఏ స్థాయిలో ఉంది విజయానికి ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే విషయమై ఎప్పటికప్పుడు చర్చించనున్నారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడ జీహెచ్ఎంంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సమయంలో పరోక్షంగా బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ దఫా కాషాయ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే అగ్రనేతలను జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో వినియోగించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here