అప్పుందని 16 గంటల డ్యూటీ …గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడు మృతి

0
359

తాజాకబురు డెస్క్: ఎన్నీ ప్రభుత్వాలు మారిన గల్ఫ్ కార్మికుల “తల రాత” మాత్రం మారటం లేదు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఎందరికో ఎన్నో పధకాలు ప్రకటించిన,రాష్ట్రంలో పనిలేకనే ఇతర దేశాలకు వెళుతున్న గల్ఫ్ కార్మికులకు మాత్రం చేసింది ఏమీలేదు,వెరసి తెచ్చుకున్న అప్పులు తీర్చలేక ,ఇక్కడ పనులు లేకా విదేశాలకు వెళ్లిన ఎందరో గల్ఫ్ కార్మికులు అనారోగ్యంతోనో,లేకా ఇతర కారణాలవల్ల శవం అయి ఇంటికి వస్తున్నారు,ఇలాంటి ఉదంతాలు ఎన్నీ జరుగుతున్న పట్టించుకునె నాధుడే లేడు ఎందుకంటే గల్ఫ్ లో ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చి ఓట్లు వెయ్యరు కదా!!!!

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన పుల్లా రవిగౌడ్ గత వారం రోజుల క్రితం కువైట్ లో గుండెపోటు తో మృతి చెందాడు, పున్న రవి గౌడ్ ఇది నిరుపేద కుటుంబం గత 18 సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు .అయితే ఆడపిల్లల వివాహాలు చేయడం కోసం గల్ఫ్ వెళ్తున్నా రవి గౌడ్ తన ఇద్దరు కూతుళ్ల వివాహాలు తాను గల్ఫ్లో ఉంటూనే వివాహం చేశాడు, దీంతో 15 లక్షల వరకు అప్పు అయింది అప్పు ఇచ్చేందుకు గత మూడు సంవత్సరాల క్రితం మళ్లీ కువైట్ వెళ్ళాడు, రవి గౌడ్ చేసే కంపెనీ ఎనిమిది గంటల డ్యూటీ ఉంటుంది కానీ ఎనిమిది గంటల డ్యూటీ చేస్తే వచ్చే జీతంతో అప్పు తీర్చడం కష్టమని భావించిన రవి గౌడ్ ఓవర్ టైంతో మరో ఆరు గంటల పాటు డ్యూటీ చేసేవాడు దీంతో ఆరోగ్యం క్షీణించింది, తెచ్చిన అప్పులు తీర్చలేక ఇంటికి డబ్బులు పంపించలేదు వడ్డీలు కట్టలేక నాన్న నరకయాతన పడి గుండెపోటుతో మృతి చెందాడు, పదిహేను లక్షల రూపాయల అప్పు ఉండడం ఉండడానికి ఒక్క రూము మాత్రమే ఉంది ,కడు పేదరికంలో బతుకీడుస్తున్న ఆ కుటుంబాన్ని పట్టించుకునే నాధుడే లేడు. వారం క్రితమే మృతి చెందిన అతని మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కానీ ఆ కుటుంబాన్ని ఆదుకో కపోతే వారి పరిస్థితి కడు దయనీయంగా మారే పరిస్థితి ఏర్పడింది, ఇలా ఒక రవి గౌడ్ కుటుంబమే కాదు రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు పడుతున్న ఆవేదన వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు ఎన్నారై పాలసీని అమలు చేయాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికులు ఉద్యమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు, మా బ్రతుకులు ఎవరికి పట్టవు, దేశంలో ఉంటే ఓటు హక్కు ఉన్నవాళ్లకు ప్రభుత్వం ఏమైన చేస్తుందో తెలియదు కానీ తమను మాత్రం పట్టించుకునే వారే లేరని గల్ఫ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రవి గౌడ్ కుటుంబానికి మనసున్న మారాజు సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు..

పుల్ల సుమలత అకౌంట్ నంబర్ 52143844399 IFSC SBIN0020145 STSTE BANK OF INDIA METPALLY MAIN, KHADI COMPLEX ,MAIN ROAD METPALLY

ఈ నంబర్ కు మీ సాయం అందించవచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here