అనుభం లేదు కానీ అద్బుతంగా తయారు చేశాడు

0
138

మెట్పల్లిలో సహజసిద్దమైన మట్టివినాయకుడిని తయారు చేసిన యువకుడు..
తాజా కబురు ప్రతినిధి మెట్పల్లి:కరోనా కష్టకాలంలో వినాయక విగ్రహాలను తయారు చేసిన ప్రభుత్వ నిభందనల ప్రకారం మూడు ఫీట్లకన్న ఎక్కువ ఎత్తులో ఉంచరాదని ఈ వినాయక నవరాత్రోత్సవాలకు అందరు దూరంగా ఉన్నారు,కానీ ఓ ఇంటర్ చదివె యువకుడు మాత్రం ఇంట్లో ఉండి మట్టి వినాయకుడిని తయారు చేశాడు, ఆ విగ్రహాం చూడటానికి ఎంత అందంగా ఉందంటె సాక్షాత్తు వినాయకుడె వచ్చి కళ్లముందు ఉన్నాడా అనెంత, అది ఎక్కడ ఆ యువకుడు ఎలా తయారు చేశాడో తెలుసుకోవాలంటె మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అశ్విన్ గురించి తెలుసుకోవాలి.

మెట్పల్లికి పట్టణంలోని శాస్త్రి రోడ్డులో నివాసముంటాడు, అశ్విన్ తాత అయిన ఇల్లెందుల కిషన్ కు వినాయకుడు అంటె ఎనలేని భక్తి దానితో గత 27 సంవత్సరాల నుండి వినాయకుడిని ప్రతిష్టిస్తు వస్తున్నాడు, కానీ ఈ సంవత్సరం వినాయకులను పెట్టవద్దు అంటున్నారు, అలాగె ఎత్తు కూడా చెపుతున్నారు, ఈ సారీ బొజ్జగణపయ్య మన ఇంట్లో సందడి చేసె అవకాశం లేదా అంటు తనలోని భావాన్ని తన మనవడితో చెప్పాడు, బయటనుండి తెచ్చిన వినాయకులకు బదులు సొంతంగా మట్టితో వినాయకుడిని తన తాత కోసం, సమాజానికి మట్టి వినాయకుడి వల్ల జరిగె లాభాలకోసం ఎలాంటి అనుభవం లేకున్నా వినాయకుడిని తయారు చేశాడు అశ్విన్, సహాజసిద్దంగా అది కూడా కళ్లకు కట్టినట్టు,మట్టితో చేసినట్టు కనిపించలేనంత తయారు చేశాడు, ఇంట్లో ఉన్న మట్టిని ఒక్కచోట చేర్చి వారం రోజుల్లోనె తన కళనైపుణ్యాన్ని ప్రదర్శించాడు ఆ యువకుడు, అశ్విన్ ఇప్పుడు ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతున్నాడు, ఇలా తన తాతయ్య చెప్పడంతో అట్టె ఆ వినాయకుణ్ని తయారు చేసి పలువురిని ఆకట్టుకుంటున్నాడు, మట్టివినాయకుడి విగ్రహాం వల్ల అటు ప్రక్రుతికి ఇటు మనుషులకు మేలు జరుగతుందని ఎలాగైనా మట్టివినాయకుడి ప్రతిమను అందంగా చెక్కాలనుకుని ప్రతిరోజు వినాయకుడిని తలుచుకుంటు , అందుకు తగ్గట్టు సాధన చేశానని చెపుతున్నాడు అశ్విన్, ఇప్పుడు మెట్పల్లిలో ఆ వినాయకుడు ఎందరినో ఆకర్శిస్తున్నాడు, ప్రత్యేకంగా వచ్చి ఆ వినాయకుడిని దర్శణం చేసుకుని అశ్వన్ కు అభినందనలు చెపుతున్నారు, ఎలాంటి కళనైపుణ్యం లేకున్న అంతమంచి వినాయకుడికి రూపునిచ్చిన ఈ యువకుడు ఇంకా మరెన్నో విజయాలకు సాధించాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here