అధికార పార్టీ దర్నాలు ..అయోమయంలో రైతులు,ఎవరని నమ్మాలి..బలబలాలు తెలుసుకునెందుకే దర్నాలా…అధికారాల్లో ఉన్న పార్టీ దర్నాలా…అవ్వా…

0
32

తాజాకబురు హైదారాబాద్: రైతు రాజు….అవును రైతు ఎప్పుడు రాజునే,కానీ మనసున్న మారాజు డబ్బులున్న,దర్పం ఉన్న రాజు కాదు,ఆకలితీర్చె రారాజు,అందుకె ప్రతి రాజకీయ నాయకుడు ముందుగా “టార్గెట్’ చేసెది ” రైతు ” నే…ప్రతిరాజకీయ చదరంగంలో ఖచ్చితంగా “పావు” గా మాత్రం రైతు ఉంటాడు,రాజకీయ నాయకుల ఆట,పాట అన్నీ రైతులనుండె మొదలవుతాయి,ప్రభుత్వం ఉండాలన్న కూలాలన్న అది రైతుల చేతుల్లోనె ఉంది,ఇప్పుడు ఇదంత ఎందుకంటే…… పట్టమంటె కప్పకు కోపం, వదలమంటె పాముకు కోపం అన్నట్టు,రైతులు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామనుకుంటె కొనుగోలు చెయ్యకుండా,నువ్వే కొనలేదు,లేదు లేదు నువ్వే కొనలేదు అంటున్నారు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులకు కావాల్సింది తాము పండించిన పంట కొనుగోలు చేయాలి అది కేంద్రమైన రాష్ట్రమైన ఏదైన సరే,కానీ ఇప్పుడు వాళ్లీద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని రైతులకు తలనొప్పి తెస్తున్నారు…..

టిఆర్.యస్ నాయకుల దర్నా…

This image has an empty alt attribute; its file name is ొిత-చద-1024x577.jpg

రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని నిందిస్తూ ఈ రోజు రాష్ర్టవ్యాప్తంగా దర్నాలు పిలుపునిచ్చింది,ఈ నేపధ్యంలో ప్రతి మండల గ్రామాల్లో కేంద్రప్రభుత్వం యాసంగి పంట ను పూర్తి స్తాయిలో కొనుగోలు చెయ్యాలని దర్నా నిర్వహించారు, టిఆర్,యస్ పార్టీ నాయకులు, ఇంత వరకు ఓకె కానీ ఇలా రాష్ర్ట్రభుత్వం, అదీ అధికారలంలో ఉన్న ప్రభుత్వవ ఇలా కేంద్రం పై దర్నాలు నిర్వహించటం ఏంటనీ ప్రజానీకం అంటుంది, ఓ పక్క వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి ఎప్పుడు కొనుగోలు చేస్తారా అంటు చూస్తున్న రైతన్నకు ఏది అర్థం కాక అయోమయపస్థితి లో పడ్డాడు..

ఒకరిపై ఒకరు నిందలు…

This image has an empty alt attribute; its file name is 1600x960_1015412-trs-vs-bjp-1024x614.jpg

ఎన్నీ ప్రభుత్వాలు మారుతున్న రైతులకు ఓ చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకోవటమె కానీ రైతుకు లాభసాటీ చేసింది ఏది లేదు,ఇప్పటికె ఐకేపి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు,రైతులు కూడా తమ పంటను తీసుకొచ్చి మార్కెట్ కు తరలిస్తున్నారు,ఈ సమయంలో (ఆట మోపుకొచ్చినాక మద్యలో తూట్) పడినట్టు ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవటం తప్ప రైతులకు ఒరిగింది ఏం లేదని అనుకుంటున్నారు…

మార్పు…మార్పు…

రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం తాము చెప్పిన పంటనె వెయ్యాలంది,తర్వాత అది కార్యరూపం దాల్చలేదు,గత సంవత్సరం ఎంత వరి పంట వచ్చిన మనకు నష్టం లేదని చెప్పింది,ఇప్పుడు కేంద్రం కొనుగోలు చెయ్యాలనుంటుంది, ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు,కాఫి టూ…కాఫి అన్నట్టు… ఈరోజు అధికార టీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది దీంతో రాష్ట్ర రైతులను గందరగోళంలో పడేసే వింత పరిస్థితి నెలకొంది, అసలు కొనుగోలు చేసేది ఎవరు! ఈ వింత పరిస్థితి బాధ్యులెవరు అంటూ రైతులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పై మండిపడుతున్నారు, తమ బలబలాలు నిరూపించుకునేందుకు రైతులను అడ్డంపెట్టుకుని పబ్బం గడుపుకోవడమే తప్ప రైతులకు చేసిన శ్రేయస్సు ఏంటని అడుగుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here