అత్యవసరంగా రక్తదానం చేసిన యువకుడు

0
154

కోరుట్ల తాజా కబురు: మండలం లోని పైడిమడుగు గ్రామానికి చెందిన కొండవీటి మహేష్ ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ప్రమాద వశాత్తు ట్రాక్టర్ డీకొట్టడంతో ఎడమ కాలు విరగడం జరిగింది. అత్యవసర సమయంలో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామానికి చెందిన పంచతి వినయ్ యాదవ్ కు విషయం తెలియడంతో వెంటనే స్పందించి ఓ పాజిటీవ్ రక్తం దానం చేసాడు. చిన్న వయసులోనే రక్తదానం చేసిన పంచతి వినయ్ యాదవ్ ను టి.వై.యం.ఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, కొండవేని గంగాధర్ యాదవ్, గ్రామస్తులు యువకున్ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here