అక్రమ కార్యకలాపాలపై వరసగా 2వ రోజు జిల్లా పోలీసులు దాడులు.

0
131

జిల్లా వ్యాప్తంగా 17 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
19,580/-రూపాయల ప్రభుత్వ నిషేధిత గుట్కా
7 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత
పేకాట స్థావరాలపై దాడి 12 గురిని అదుపులో కి తీసుకొని వారి వద్దనుండి ₹1,28,830/-రూపాయలు స్వాధీనం.

జగిత్యాల తాజా కబురు: జిల్లా ఇంచార్జ్ ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ వి. బి కమలసన్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కే సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వరసగా రెండవ రోజు అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఇసుక అక్రమ రవాణాపై కొరడా, ఈరోజు జిల్లా వ్యాప్తంగా 17 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత:ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇసుక రవాణానకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న వ్యక్తుల పై చర్యలు తప్పవని అదనపు ఎస్పీ గారు హెచ్చరించారు. ఒక పక్క విరామం లేకుండా శాంతిభద్రతల పరిరక్షణకు విధులు నిర్వహిస్తూ మరోపక్క ఇసుక అక్రమ రవాణాకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా కు పాల్పడే వారి పై కేసులు నమోదు చేయడం తో పాటుగా వాహనాల ను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 17 ఇసుక ట్రాక్టర్ల ను పట్టుకోవడం జరిగిందని జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిప్పన పేట గ్రామ శివారులో 4 ఇసుక ట్రాక్టర్లను,బోయిన్పల్లి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను మల్యాల పోలీసులు పట్టుకోవడం జరిగిందని, మెట్పల్లి శివారు ప్రాంతమైన లింగంపల్లి లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను కోరుట్ల పోలీసులు పట్టుకోవడం జరిగిందని, సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇసుక ట్రాక్టర్లను, బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 ఇసుక ట్రాక్టర్ ను, పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బతుకపల్లి శివారు ప్రాంతాల్లో 1 ఇసుక ట్రాక్టర్లను రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 ఇసుక ట్రాక్టర్ ను, కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో 1 ఇసుక ట్రాక్టర్ ను పట్టుకోవడం జరిగిందని వీటన్నిటి పైన కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
19,580/-రూపాయల/గుట్కా పట్టివేత:
కథలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుంపేట గ్రామంలో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణం లో తనిఖీ నిర్వహించి 9845/- రూపాయల గుట్కా ను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు రమేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది.
వెల్గటూర్ మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణం లో తనిఖీ నిర్వహించి 1650/- రూపాయల గుట్కా ను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడి పై కేసు నమోదు చేయడం జరిగింది.
బుగ్గారం మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణం లో తనిఖీ నిర్వహించి 1500/- రూపాయల గుట్కా ను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు గంగాధర్ పై కేసు నమోదు చేయడం జరిగింది.
ధర్మపురి మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణం లో తనిఖీ నిర్వహించి 3485/- రూపాయల గుట్కా ను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు శ్రీధర్ పై కేసు నమోదు చేయడం జరిగింది.
మెట్పల్లి మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణం లో తనిఖీ నిర్వహించి 1000/- రూపాయల గుట్కా ను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు ప్రవీణ్ పై కేసు నమోదు చేయడం జరిగింది.
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణం లో తనిఖీ నిర్వహించి 2100/- రూపాయల గుట్కా ను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడం జరిగింది.
పేకాట స్థావరాలపై దాడి12గురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి ₹1,28,830/-రూపాయలు స్వాధీనం:
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్గం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన సమాచారము మేరకు ఎస్.ఐ సతీష్ గారు తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 8 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ₹ 1,02,000/- రూపాయలను,5బైక్స్ లను,7మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారి అందరి పై కేస్ నమోదు చేయడం జరిగిందిని తెలిపారు.
కోరుట్ల పట్టణ శివారులో పేకాట ఆడుతున్నారన సమాచారము మేరకు స్పెషల్ బ్రాచ్ హెడ్ కానిస్టేబుల్ రావుఫ్ గారు తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 4గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ₹ 26,830/- రూపాయలను,6బైక్స్ లను,4మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తదుపరి విచారణ నిమిత్తం కోరుట్ల పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగిందిని తెలిపారు.
7 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత: జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తకళపల్లి గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా ఆటో లో రేషన్ బియ్యం తరలిస్తున్నాడు అన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన ఎస్.ఐ సతీష్ గారు సుమారు 7 క్విటాళ్ల రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది.రేషన్ బియ్యంను,ఆటోను, ముగ్గురు వ్యక్తుల ను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి తరలించి కేస్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here