అంత్యక్రియలు నిర్వహించిన బిజేవైఎం యువమోర్చా,దళిత మోర్చాల అధ్యక్షులు

0
58

అంత్యక్రియలు నిర్వహించిన బిజేవైఎం యువమోర్చా,దళిత మోర్చాల అధ్యక్షులు
జగిత్యాల తాజా కబురు:
రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రామక్క (65) జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు బిజేవైఎం మండల అధ్యక్షులు,ఎంపిటీసి రాజనాల మధుకుమార్ ను సంప్రదించగా ఆయనతో పాటుగా బిజేవైఎం మండల దళిత మోర్చా అధ్యక్షులు చెలిమెల మల్లేశంలు కుటుంబం సభ్యులకు పి.పి.కిట్లు ధరించి దహణ‌ సంస్కారాలు నిర్వహించడం పై అవగాహన కల్పించారు.కాగా కుటుంబ సభ్యులు కళ్యాణ్,సాయి లతో కలిసి మృతదేహానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా మండలంలో కరోనా తో మృతి చెందిన వారికి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు తమను సంప్రదించవచ్చని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here