
రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఆదివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని కొత్తకుండలో నైవేద్యం వండి,చిన్నముంతలో పానకం పోసి, దానిపై దివ్వే పెట్టి బోనంజ్యోతి వెలిగించి కన్నులపండుగగా డప్పు చప్పుళ్లతో,ప్రదర్శనగా గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరం లో ఉన్న శ్రీగిరి పర్వతంపైకి భక్తులు కాలినడకన వెళ్లి కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తిప్రపత్తులతో కనక దుర్గ దేవికి నైవేద్యం సమర్పించారు.ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.ఈ ఉత్సవాల్లో ఆలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నర్ర రాజు, ఉపాధ్యక్షులు గంగుల భూమేష్, ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి రాజు, కోశాధికారి అల్లకొండ సుధాకర్,సభ్యులు బాలన్న,గంగారెడ్డి, గంగరాజం,రమేష్,రఘుపతి,రాజు, దేవి దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.