యువత లక్ష్య సాధన తో ముందుకు వెళ్లాలి: ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ ఏ. ఎమ్.రాజు రెడ్డి

0
47

తాజా కబురు: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని చిన్న జియర్ స్వామి ట్రస్ట్ భవనం లో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ,యువకులకు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం,లక్ష్య సాధన గురించి శుక్రవారం ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ ఏ. ఎమ్. రాజు రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో విజయం సాధించడం ఎలా అనే అంశాన్ని వివరిస్తూ, లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం దాన్ని సాకారం చేసుకోవడంలో యువతకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చైతన్యం తో పాటు సమయపాలన పాటించాలన్నారు. అప్పుడు మాత్రమే అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్, ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి,సిబ్బంది ప్రమోద్, చిరంజీవి, శ్రీకాంత్, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here