మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడమే ఆరోగ్య రథం లక్ష్యం:డాక్టర్ చెన్నమనేని వికాస్-దీప

0
38

జగిత్యాల తాజా కబురు :నగునూర్ కరీంనగర్ ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని తాండ్రియాల గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ చెన్నమనేని వికాస్-దీప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యం మీ ముంగిట్లో అనే లక్ష్యంతో మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించినట్లు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి వైద్య సేవలు అందించనున్నట్లు,సోమవారం 586 ఓ.పి చూడటం జరిగిందని, 176 మందికి పలు రకాల వైద్య పరీక్షలను మంగళవారం ఆరోగ్య రథం ద్వారా గ్రామ పంచాయతీ ఆవరణలోనిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడిల గంగా ప్రసాద్,ఎంపిపి జవ్వాజి రేవతి గణేష్, జెడ్పీటీసీ సభ్యులు నాగం భూమయ్య, ఇంచార్జి ఎస్ఐ అలీం ఉద్దీన్,ఏఎంసి చైర్మన్ వర్దినేని నాగేశ్వర్, వైస్ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, వైస్ ఏఎంసీ చైర్మన్ నాంపల్లి లింబాద్రి,బిజెపి సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వరరావు, బద్రి సత్యం,ఎడ్మాల వినోద్ రెడ్డి, అజయ్ రావు, ప్రకాష్, అంజయ్య, గాంధారి శ్రీనివాస్, ప్రసాద్, మర్రిపెల్లి రమేష్ గౌడ్, జలంధర్ రెడ్డి, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి,బిజెవైఎం మండల అధ్యక్షులు తోకలా వినోద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ గౌడ్, సునీల్, మహేష్, రాజేందర్, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here