నిరుద్యోగభృతి తక్షణమే చెల్లించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్

0
18

జగిత్యాల తాజా కబురు:భారతీయ జనతా యువమోర్చ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణం లోని తహసీల్ చౌరస్తాలో నిరుద్యోగ సమస్యలపై బుధవారం బీజేవైఎం నాయకులు వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగుల బతుకులు మారుతాయని, కోటి ఆశలతో ఎదురుచూస్తే రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తి అయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా తన కుటుంబంలో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకుని రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగుల భవిష్యత్ ను సీఎం కేసీఆర్ రోడ్డున పడేయడం బాధాకరం అన్నారు.ఒక పక్క నోటిఫికేషన్ వస్తదని యూనివర్సిటీల్లో విద్యార్థులు, మరో వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని, ఇకనైన రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా విద్యార్థి, నిరుద్యోగుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కాళిగా ఉన్న 1 లక్ష 94 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,మేనిఫెస్టో ప్రకారం విద్యార్థులకు నిరుద్యోగభృతి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినికెల నవీన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి, భైన ప్రశాంత్, ఉమేష్, జిల్లా కార్యదర్శి మర్రిపెల్లి గంగాధర్, కోశాధికారి గుర్రం రంజిత్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు రవితేజ, ప్రెంసాగర్, వెంకటేష్, వినీత్, బీజేవైఎం, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here