చక్కర కర్మాగారం తెరిపించాలని రైతులు ఆందోళన...
సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి కిరోసిన్‌తో దూసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు…
హామి ఇవ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు, నాయకులు…
22 తేది బ్లాక్ డే గా ప్రకటించిన రైతులు…
రోడ్డుపై వంటవార్పు- బోజనాలు-ఆటలు పాటలు-
16 గ్రామాలనుండి తరలివచ్చిన 8000 మంది రైతులు….
జాతీయ రహాదారి పై నిరసనలు, స్తంబించిన రాకపోకలు,
తాజకబురు న్యూస్ః- జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్ చక్కర కర్మాగారం తెరిపించాలంటు రైతులు, నాయకులు చేస్తున్న నిరసనలు ఉదృక్తతకు దారి తీసాయి, మెట్పల్లిలో ఆరు మండలాలకు చెందిన రైతులు చేరుకుని దర్నా, రాస్తరోఖోలు నిర్వహించారు. ఫ్యాక్టరీ వెంటనె తెరిపించాలని నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు పలువురు సబ్ కలెక్టర్ కార్యలయం ముందు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి తమకి హామీ ఇచ్చెవరకు దిగబోమని అక్కడె కూర్చున్నారు, అలాగె పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అందరు చూస్తూండగానె తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాటిల్లోని కిరోసిన్ మీదపోసుకుంటు సబ్‌కలెక్టర్ ఆఫీలోకి దూసుకెళ్లాడు, ఆత్మహత్యయత్నం చేస్తున్న క్రమంలో అక్కడున్న పలువురు అతన్ని ఆపె ప్రయత్నం చేశారు. పట్టణంలోని జాతీయ రహాదారి పై సుమార్ వేల సంఖ్యలో దర్నా, రాస్తరోఖో నిర్వహించారు. అనంతరం రోడుపై బతుకమ్మ ఆటలు ఆడి, రోడుపైనె బోజనం చేశారు. 23 -12- 2015 సంవత్సరంలో ప్రభుత్వపరం చేస్తామని టిఆర్‌యస్ ప్రభుత్వం కర్మాగారాన్ని మూసివేసింది, ఇక్కడ 5000 హెక్టర్లలో చెరుకు పంట సాగు అయ్యెది, కానీ ఫ్యాక్టీ మూతపడటంతో వేల సంఖ్యలో రైతుల రోడు పడ్డారు. 5000 హెక్టరులో ఉన్న సాగు కాస్తా 1000 హెక్టర్లకు పడిపోయింది. వేల సంఖ్యలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉఫాది కోల్పోయారు. ప్రభుత్వం రైతులు వాటతో నడిపించాలని ముందుగా తీర్మానించింది, కానీ రైతుల వల్ల అది కాదు అన్న విషయం తెలుసుకొనె ప్రభుత్వం సేఫ్ గేమ్ ప్లాన్ చేసి కర్మాగారాన్ని మూసివేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.రెండున్నర సంవత్సరాలుగా చెరుకు పంట సాగు చెయ్యకా, చేసిన పంటలు నష్టం వాటిల్లి తాము నాశనం అయ్యామని దీనికి పూర్తిగా ప్రభుత్వం బాద్యత వహించాలని రైతులు అంటున్నారు..