రాయికల్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

0
36

తెలంగాణాలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదు:కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మాదిగకుంట లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మిత్రుడు మందకృష్ణ మాదిగ ఉద్యమంతో అప్పటి ప్రభుత్వం వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారని, ఇప్పుడున్న కెసిఆర్ ప్రభుత్వం కరోనాను, డెంగ్యూను ఆరోగ్య శ్రీ లో చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుమతి ఇవ్వడం లేదని నిరుపేదలు వైద్యానికి ఇల్లు తాకట్టు పెట్టుకున్నారని, తక్షణమే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు చికిత్స అందించాలని, పేదల మనుగడను దళితుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న తె.రా.స ప్రభుత్వ విధానాలు సరికావని, దళిత సాధికారత పేరుతో 400 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం దళితులకు కేటాయించిన 37 వేల కోట్లు ఎటు పోయావని ఈ సంధర్బంగా ఆయన ప్రశ్నించారు.మాదిగ కుంట భూములు కబ్జా నుండి వెలికితీసి మాదిగలకు వాట ఉండే దాకా అండగా ఉంటామని,పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాది ముబరక్ మంచిదే కానీ పెళ్లి చేసుకున్నవారికి ఇల్లు మంజూరు చేయకపోవడంతో వారు ఎక్కడ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ జిల్లా కన్వీనర్ దుమల గంగారం,నియోజక వర్గం ఇంఛార్జి పడిగెల మల్లయ్య,రాయికల్ ఎమ్మార్పీ ఎస్ ఇంఛార్జి ఎం.రాజేందర్,యువసేన ఇంఛార్జి నిగా భుమేశ్వర్, కౌన్సిలర్ మరంపెల్లి సాయికుమార్,జిల్లా నాయకులు నక్క సతీష్,బాపు రపు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here