నిన్న 5 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ధర్మపురి పోలీసులు

0
187

తాజా కబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచార ఘటనకు సంబంధించి
ఓ బాలిక యొక్క తల్లి ఈ రోజు తేదీ 16-9-2021 నాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 371/2021 U/C 448,376(A)(B) IPC సెక్షన్ 6 Of POCSO Act 2012 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ధర్మపురి సి.ఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది‌. ఈ యొక్క బృందంలో ఏఎస్సై రాజు, కానిస్టేబుల్ లు నర్సింగరావు,సతీష్ తో కలిసి నిందితుడిని ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు నేరెళ్ల సాంబశివుని గుట్ట వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.
నిందితుడి వయస్సు 18 సంవత్సరాలు కరీంనగర్ లోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడని,అత్యాచార ఘటనకు కు సంబంధించి బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక యొక్క వాంగ్మూలాన్ని మహిళ ఎస్.ఐ నవత ఆధ్వర్యంలో నమోదు చేసినట్లు, బాలిక యొక్క వాంగ్మూలాన్ని వీడియోగ్రఫీ చేయించి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here