మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు,మల్యాల మండలం మద్దుట్లలో 29 పాజిటివ్ కేసులు నమోదు

0
142

తాజా కబురు మల్యాల ప్రతినిధి రాకేశ్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో కరోనా ప్రమాద ఘంటికలు మళ్లీ మోగిస్తున్నాయి,మొదటి వే లో మల్యాల మండలంలోని అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత సెకండ్ మీద కూడా మల్యాల మండలం లో పలువురు మృతి చెందారు సెకండ్ వే అంతమొందుతుందనే నేపథ్యంలో ఇప్పుడు మద్దుట్ల గ్రామంలో 130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 29 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది, దీంతో మండలంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు,గడిచిన నలుబై రోజుల్లో ఒకే గ్రామంలో ఇన్నీ కేసులు నమోదు కాలేదు,ఇలా ఒకే గ్రామంలో కేసులు రావడం పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు, పాజిటివ్ వచ్చినవాళ్లను హోం హైసోలేషన్ కు తరలించారు,పాజిటివ్ నిర్థారణ అయినవాళ్లకు కిట్ అందజేశామని, డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుందని మండల వైద్యాధికారి లావణ్య తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here