LRS పై ఇప్పటికి ప్రజలకు ఎటువంటి స్పష్టత లేదు- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

0
42

ధరణి పోర్టల్ కి సంబంధించి ఏదైనా పొరబాటు జరిగితే దానిలో సవరించే ఆప్షన్ లేదు.

జగిత్యాల తాజా కబురు:రాష్ట్రంలోని భూముల, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్, ధరణి పోర్టల్, ఎల్లారెస్ విధానాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో ఇటు నిర్మాణరంగం, బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు లేవని, వారసత్వ ఆస్తి కి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలని అనడంపై వారసత్వ హక్కు కు భంగం కలిగించడమేనని అన్నారు., రైతుల భూముల కు మళ్ళీ ఎకరానికి 2500 కట్టాలి అని అంటున్నారు., రాష్ట్రంలో ఇంతవరకు రిజిస్ట్రేషన్ పై మ్యుటేషన్ కి ఫీజు అనేదే లేదు ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్నారు, ఇది కేసీఆర్ సుంకం లా ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు, ప్రభుత్వం భూముల జిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేస్తున్నాం అంటే ఇదేనా అని అన్నారు., ప్రాపర్టీ కి వారసత్వ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఫ్యామిలీ వాళ్లకే చేయాలని అంటున్నారు. ఫ్యామిలీ లేని వారు ఏదైనా ట్రస్ట్ కి ఇద్దామంటే వేరే ఆప్షన్ లేదు. రాష్ట్రంలో పట్టేదారు పాసుపుస్తకాలు ఇంత వరకు ఇవ్వబడలేదు మరి వాళ్ల పరిస్తితి ఏంటి అని అన్నారు, వివిధ రాష్ట్రాల లో చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో ఉన్న మెరుగైన పద్దతులను సమీక్ష చేసి ఇక్కడ ఇంకా మెరుగైన పద్దతులను అమలు చేయాలి కానీ అన్ని నాకే తెలుసు అని కేసీఆర్ గారు అనాలోచిత పనులు చేస్తున్నారు., ధరణి పోర్టల్ కి సంబంధించి ఏదైనా పొరబాటు జరిగితే దానిలో సవరించే ఆప్షన్ లేదు, LRS పై ఇప్పటికి ప్రజలకు ఎటువంటి స్పష్టత లేదు., ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ నాకే తెలుసు అని బేషజాలకు పోతున్నారు.రాష్ట్ర అభివృద్ధి పురోగతి పూర్తిగా నిలిచి పోవడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య కారకుడు., ధరణి లావాదేవీలకు పూర్తిస్థాయిలో ఆప్షన్లు ఇవ్వాలి ,ఎల్ ఆర్ ఎస్ విధి విధానాలపై ఇప్పటికైనా ప్రజలకు స్పష్టతనివ్వాలి ,గిఫ్ట్ డీడ్ ఆప్షన్ లేక భూయజమానులకు శరాఘాతం. రాష్ట్ర ప్రభుత్వం మ్యూటేషన్ పేరుతో ప్రజలపై భారం మోపి కేసీఆర్ సుంకం తీసుకొంటున్నా రని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here