పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి కరోనా పాజిటివ్

0
17

జగిత్యాల తాజా కబురు: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, దగ్గుతో జీవన్ రెడ్డి భాధపడుతుండగా సోమవారం రాపిడ్ టెస్ట్ చేయించుకోగ కరోనా పాజిటివ్ అని తెలింది.జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి హైదరాబాద్ లో చికిత్స కోసం బయలుదేరి వెళ్లారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, రిక్షాలు, సైకిళ్లతో చేపట్టే ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనేలా మూడు రోజుల నుండి వ్యూహరచన చేయడం దాంతో కాంగ్రెస్ శ్రేణులు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని ర్యాలీకి సమయాత్తమయ్యారు. ఇంతలోనే జీవన్ రెడ్డికి కరోనా సోకిందని తెలువడంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందారు.
నిత్యం ప్రజల్లో ఉండే జననేతకు కరోనా సోకిందనే వార్త తెలియడంతో నాయకులు, ప్రజలు, అభిమానులు కరోనా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here