జగిత్యాల జిల్లాను పచ్చగా జేయాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్ జి. రవి

0
7

తాజా కబురు జగిత్యాల: భావితరాలకు ప్రకృతి సంపదను, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసి జిల్లాను పచ్చదనం తో పెంపొందించేలా చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం సారంగాపూర్ మండలం లోని రంగపేట,నగునూరు మరియు రాయికల్ మండలం రాజా నగర్, ఆలూరు అటవీ ప్రాంతాల్లో, గ్రామాలలో 7వ విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా అటవీశాఖ వారు చేపట్టిన మొక్కల పెంపకాన్ని, పరిశీలించారు. జిల్లాలో అటవిశాఖ ద్వారా రంగపేట మరియు అర్షికోట బ్లాక్, నగునూర్ బీట్ లో 27 రకాలతో ప్రత్యేకంగా నాటిన 5వేల 555 మొక్కలను పరిశీలించి మొక్కలు నాటారు. అంతరించిపోతున్న అడవులను సంరక్షించడంతో పాటు కొత్త మొక్కలను నాటి పూర్వ అటవి వైభవాన్నిపెంపొందించాలని సూచించారు. అటవి ప్రాతాలలో మొక్కలకు,జంతువులకు నీరు లభించేలా చర్యలను చేపట్టాలని సూచించారు. అనంతరం మొక్కలకు జంతువులకు నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఫామ్పౌండ్లను , నీటి గుంతలను పరిశీలించారు. అటవీ ప్రాంతంలో అక్కడక్కడ గుంతలు తవ్వి మొక్కలు నాటక పోవడాన్ని గమనించి అందులో వెంటనే మొక్కలను నాటాలని, చనిపోయిన మొక్కలు స్థానంలో వేరెమొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు.సారంగపూర్ మండలం రంగపేట వడ్డెర కాలనీలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా గత సంవత్సరం నాటిన సుమారు 15 వేల మొక్కలను, వాటి పెరుగుదలను, గత సంవత్సరంలో స్వయంగా నాటిన మొక్కను పరిశీలించారు. సారంగాపూర్ మండలం నగునూరు, రాయికల్ మండలం రాజనగర్, ఆలూరు గ్రామాలలో వైకుంఠదామం చివరిదశ నిర్మాణ పనులు,పెండింగ్లో ఉన్న పనులు వారంరోజుల్లోగా పూర్తిచేయాలని ఆయా గ్రామాల సర్పంచులను ఆదేశించారు. వినియోగంలో ఉన్న డంపింగ్ యార్డ్, సెగిరికేషన్ షెడ్ వివరాలు అడిగి తెలుసుకొని, వాటి ద్వారా ఎరువులు తయారు చేసే విధానాన్నీ పరిశీలించారు. రాజనగర్, ఆలూరు గ్రామాలలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. రాయికల్ మండలంలోని ఆర్సీ కోట రిజర్వ్ ఫారెస్ట్ నందు చేపడుతున్న మొక్కల పెంపకం పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉపాధిహామీ కూలీల చేత అడవుల్లో వీలైనన్ని ఎక్కువ గుంతలు తొవ్వించి మొక్కలు నాటాలని సూచించారు. అడవుల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు, ట్రెంచులు, ఫోమ్ పాండ్స్ వివరాలను అటవీ శాఖ అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పరిశీంచి మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవిశాఖ అధికారి వెంకటేశ్వరరావు, అడిషనల్ పిడి, మండల స్పెషల్ ఆఫీసర్ శివాజీ, ఎం.పి.డి.ఓ గంగుల సంతోష్ కుమార్, తసీల్దార్ కె మహేశ్వర్,ఎం.పి.ఓలు, పంచాయతీ కార్యదర్శిలు, ఫారెస్ట్ విద్యార్థిని భార్గవి, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here