జగిత్యాలలో బీజేవైఎం నిరుద్యోగ గర్జన ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి

0
25

జగిత్యాల తాజా కబురు: రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని అలాగే సీఎం కేసిఆర్ ప్రకటించినట్టు రెండవ సారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిరుద్యోగ గర్జన ర్యాలీ చేసి కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతం మహేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికెల నవీన్, స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచే రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి, బైన ప్రశాంత్, మెరుగు ఉమేశ్, కార్యదర్శులు కర్నె రాజేందర్ రెడ్డి, మర్రిపెల్లి గంగాధర్, ఇర్ల నవీర్, కోశాధికారి గుర్రం రంజిత్ రెడ్డి, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here