హుజురాబాద్ ఉపఎన్నిక భరిలో రాయికల్ ఫీల్డ్ అసిస్టెంట్లు

0
201

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు పట్టణంలోని అయ్యప్ప దేవాలయం ఆవరణలో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి అభ్యర్థులను ఖరారు చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో క్షేత్రస్థాయిలో చాలీచాలని వేతనాలతో పని చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం గత సంవత్సరం 2019 అక్టోబర్ నెలలో 4779 సర్క్యులర్ ను తీసుకురావడంతో దానివలన తమ ఉద్యోగాలు పోతాయని భావనతో ఆ సర్కులర్ ను సరిచేయాలని సమ్మె చేయడం జరిగిందన్నారు. గత 17 నెలల నుండి తమ ఉద్యోగాలను తొలగించి మా కుటుంబాలను రోడ్డున పడవేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల లోపు విధుల్లోకి తీసుకోని యెడల ప్రతి జిల్లా నుండి 32 మంది నామినేషన్ వేస్తామని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి లక్ష్మణ్,తిరుపతి పేర్లను ఖరారు చేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇందూరి తిరుపతి,మహేష్,రాజేందర్,నజీర్,రవి,నర్సయ్య,రాజు,శ్రీనివాస్,మల్లేశం,భూక్య తిరుపతి,నూనవత్ తిరుపతి, భూక్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here